వాహనదారులపై ఆయిల్ కంపెనీలు ధరల కక్షగట్టినట్టే కనిపిస్తున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వారి పర్సులను ఖాళీ చేస్తున్నాయి. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన కంపెనీలు.. ఇవాళ మరో మరో 27 పైసలు బాదేశాయి. తాజా పెంపుతో దేశంలో పెట్రో ధరలు ఆల్ టైం హైకి చేరాయి. ప్రస్తుతం దేశంలో పెట్రో ధరలు అత్యధికంగా జైపూర్, ముంబైలో ఉన్నాయి.
జైపూర్‌లో పెట్రోల్ ధర రూ. 93.60, డీజిల్ రూ.85.67కి చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.92.86, డీజిల్ రూ.83.30 గా ఉంటే.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.30, డీజిల్ ధర రూ.76.48 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.89.51 , డీజిల్ రూ.83.19 పలుకుతోంటే.. విజయవాడలో పెట్రోల్‌రూ.92.22, డీజిల్ రూ.83.30గా ఉంది.