ఆర్టీసీ యాజమన్యానికి మరో షాక్ తగిలింది. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన పీఎఫ్ డబ్బులు కట్టాలంటూ పీఎఫ్ అధికారులు ఆర్టీసీ యాజమన్యానికి నోటీసులు పంపారు. కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాల్సిన 760.62కోట్లు కట్టలేదని, వెంటనే జమ చేయాలని ఆదేశించారు. ఇదే అంశంపై ఆర్టీసీ ఎండీకి నోటీసులు పంపిన పీఎఫ్ రీజనల్ కమీషనర్… ఈ నెల 15లోపు పూర్తి సమాచారంతో తమ ముందు హజరు కావాలని ఆదేశించారు.
పీఎఫ్ డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించకపోతే భారీగా జరిమానాలు వేస్తుంది కేంద్రం. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ ఉందని చెప్తోన్న ప్రభుత్వం ఈ తాజా నోటీసులపై ఎలా స్పందిస్తుందో చూడాలి.