అగ్రరాజ్యం అమెరికా సోమవారం నుంచి ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. అత్యవసర వ్యాక్సినేషన్ కు ఎఫ్డీఏ అనుమతి రావటంతో హుటాహుటిన వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. అయితే మంగళవారం అలస్కాలో ఓ హెల్త్ వర్కర్‌కు ఫైజర్ టీకా ఇచ్చారు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే హెల్త్ వర్కర్‌కు తీవ్రమైన అలెర్జీ సమస్య తలెత్తింది. ఇంతకుముందు ఈ పేషెంట్‌కు ఎలాంటి అలెర్జీ సమస్యలు లేవని చికిత్స అందిస్తున్న ఎవర్జెన్సీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లిండే జోన్స్ వెల్లడించారు. అలెర్జీ చికిత్స ఎపినెఫ్రిన్ అనంతరం పేషెంట్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందన్నారు. ప్రస్తుతం పేషెంట్ జునాయులోని బార్ట్‌లెట్ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
దీనిపై అమెరికా ఎఫ్డీఏ కీలక ప్రకటన చేసింది. అలెర్జీ ఉన్న చాలా మంది అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకున్న కూడా వారిలో ఎలాంటి సమస్య తలెత్తలేదని, సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. కానీ, బ్రిటన్‌లో కూడా ఇలాగే వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు అలెర్జీతో బాధపడ్డారు. వారు కూడా చికిత్స అంనంతరం వారు కోలుకున్నారు. అందుకే అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలని బ్రిటన్ మెడికల్ రెగ్యులేటర్ అథారిటీ దేశ ప్రజలను వారించింది.