కరోనా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ల తయారీలో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకు పెద్దవారిపైనే కోవిడ్ -19 వ్యాక్సిన్లు పనిచేస్తుండగా.. ఇప్పుడు టీనేజర్లందరిపైనా పనిచేసే టీకాను తాము రూపొందించినట్టు ఫైజర్- బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా ప్రకటించాయి.
తాము తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ 12 ఏళ్లకుపైబడిన వారందరిపైనా ప్రభావవంతంగా పనిచేస్తోందని ఫైజర్ ప్రకటించింది. అలాగే సురక్షితమని కూడా తేలినట్టు స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఫైజర్ టీకాను 16 ఏళ్లకు పైబడినవారకి మాత్రమే వేస్తూ వచ్చారు. కాగా ఇటీవలే 12-15 ఏళ్ల వయసు పిల్లలు 2,260 మందిపై ప్రయోగాలు జరిపామని చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారుల్లో ఎవరూ కరోనా వైరస్‌కు గురి కాలేదని, అలగే ఎలాంటి దుష్ఫ్రభావం కనిపించలేదని తెలిపింది. సాధారణంగా పెద్దలకు వచ్చినట్టే చలి, జ్వరం వంటి లక్షణాలు మాత్రమే కనిపించాయని పేర్కొంది.
టీనేజర్లపై ప్రయోగాలు సక్సెస్ కావడంతో అత్యవసర వినియోగానికి అనుమతులు కోరేందుకు ఫైజర్ సిద్దమవుతోంది.