– ఫినిక్స్ టార్గెట్ ప్రైమ్ ల్యాండ్సే!
– ఎయిర్ పోర్ట్ కు ఏడు కిలీమీటర్ల దూరంలో..
– ఇనాం భూముల్లో ఫినిక్స్ దందా
– పటేల్ ఇంజనీర్స్ తో కాని పని..
– ఫినిక్స్ తో సాధ్యమా!
– కోర్టు కేసులంటే లెక్కచేయని రేరా
– గులాబీ బినామీల మైకంలో అధికారులు
– 2005లోనే చక్రం తిప్పిన టీ.ప్రకాశ్ గౌడ్!
ఫినిక్స్ కంపెనీ అనుకున్నది అనుకున్నట్లు జరగాలి.వాళ్లు కావాలనుకున్నభూమిలో కేసులున్నా..లిటిగేషన్లు ఉన్నా..ఇంకెలా ఉన్నా…రూల్సేవీ ఫినిక్స్ కు వర్తించవు.పైగా భూమి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఈ డాక్యుమెంటే కీలకం,ఇంకా ఎలాంటి టైటిల్ అడగొద్దంటూ అధికారులపై హుకుం జారీ చేస్తారు.తమకు ఇబ్బందులు అవుతాయని ఎదైనా ఒక ఆఫీసర్ చెప్పితే..వారికి అనుకూలమైన తీర్పును చిటికెలో పట్టుకొస్తారు. ఏండ్లకు ఏండ్లు తిరిగినా కాని పని వారికి మాత్రం రోజుల్లో అయిపోతుంది. ప్రతివాదుల వర్షన్ వినకుండానే భూములకు అన్నిఅనుమతులు ఇచ్చేస్తారు.ఆ అక్రమ అనుమతులతోనే ఎంతటి వారినైనా లొంగదీసుకుంటారు. మేము నష్టపోయామని మొత్తుకున్నవారి మాటలు పెడచెవిన పెడుతారు. కానీ బాధితులు న్యాయస్థానాల్లో కేసులు వేయడంతో ఓ మెట్టు దిగి వచ్చారు ఫినిక్స్ గ్యాంగ్. దీంతో కేసుల విత్ డ్రా ప్రక్రియ కొనసాగుతోంది.తవ్వేకొద్దీ ఈ భూముల్లో ఆక్రమణలు బయటపడుతున్నాయి.
ఇనాం భూములను ఇలా మెప్పించారు..!
బాలాపూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఇనాం భూములు ఉన్నాయి.ఎప్పటి నుంచో ప్రభుత్వం వాటికి మ్యుటేషన్ చేయడం లేదు. రక్షిత కౌలుదారులు ఉన్నారు. ఇలా 42 ఎకరాల్లో భూ వివాదం ఉంది. ఎయిర్ పోర్ట్ కి దగ్గరగా ఉండటం.ఖాళీ ప్రాంతం కావడంతో 2002లోనే టీ.ప్రకాశ్ గౌడ్ అనే రాజకీయనాయకుడు సర్వే నెంబర్ 41లో పదెకరాల భూమిని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు.కాని అతని వల్ల కాలేదు. దీంతో దేశంలోనే మంచి పేరున్నముంబాయి కంపనీ పటేల్ ఇంజనీరింగ్స్ వారు కొనుగోలు చేశారు.అటు..వివాదం ఉన్న భూమి కావడంతో ఫినిక్స్ చేజిక్కించుకొని రియల్ దందా చేస్తుంది. డాక్యుమెంట్ నెంబర్ 366/2019 లో జూలై 5న కొనుగోలు చేశారు.ఆరు నెలల్లోనే ఫినిక్స్ పేరు మీదుగా File No.MUT/05/03/00019/2020 Dated:11-02-2020 న బాలాపూర్ తహశీల్దార్ మ్యుటేషన్ చేసి ఇచ్చారు.కరోనా సమయంలోఎలాంటి వాదనలు లేకుండానే 30 యేళ్ల వివాదానికి తెరలేపారు.ఇదే మ్యూటేషన్ ని అడ్డుపెట్టుకుని ఈ ఏడాది జనవరి 4న హెచ్.ఎం.డీ.ఏ.లో అనుమతులు తీసుకున్నారు.సర్వే నెంబర్.41లో10ఎకరాల 12 గుంటలు, 42,43లో3ఎకరాల15 గుంటలు 56,57,58లో 14 ఎకరాలు, సర్వే నెంబర్ 60 లో 7 ఎకరాల 9గుంటలు, 63,64 సర్వే నెంబర్లలో 8 ఎకరాల 6 గుంటలు ఇలా మొత్తం 44 ఎకరాల 10 గుంటల భూమిని దక్కించుకున్నారు.
కోర్టు కేసులు ఇవే..
హైకోర్టులో ఈ భూముల పై రిట్ పిటిషన్ దాఖలయ్యాయి. WP NO. 14838/2020, 14840,14841,14842/2020 నెంబర్లతో కోర్టు ప్రతివాదుల పిటిషన్ ని స్వీకరించింది. మిర్ ఫయాజ్ ఆలీఖాన్, అబ్దుల్ బిన్ మహ్మద్ లు కోర్టు గడప తొక్కారు. అడిషినల్ కలెక్టర్ ఇచ్చిన F1/883/2019 dated 20/06/2020, ఆర్డీవో ఇచ్చిన J/2201/2018 dated 11/03/2019 ఉత్తర్వులు రాజకీయ పలుకుబడితో ఇచ్చారని విన్నవించారు. రాజీకుదుర్చేందుకు అర్బీర్ట్రేటర్ ఇనాం యాక్ట్ ని ఉల్లంఘించి ఆర్టికల్ 14,19,21, 300 ఏ, ప్రకారం నష్టం వాటిల్లేలా చేశారని తెలిపారు. దీంతో జస్టిస్ షమీం అక్తర్ పిటిషన్ స్వీకరించి ఫినిక్స్ తో పాటు పటేల్ ఇంజనీర్స్..తమదే భూమి అంటూ చెప్పుకున్నవారికి నోటీసులు జారీ చేసింది.మరో ఫైల్ నెంబర్ F1/884/2019 dated 20- 06- 2020,ఆర్డీవో ఉత్తర్వులు No. J/1790/2018 dated 11 03 2019 ఇచ్చినవి పొలిటికల్ ప్రెజర్ ఉందని తెలిపారు.
విచారణలో ఉండగానే రేరా ,హెచ్.ఎం.డీ.ఏ అనుమతులు
కోర్టులో లాండ్ లార్డ్స్ కేసు పెండింగ్ లో ఉండగానే హెచ్.ఎం.డీ.ఏ. జనవరిలో..రేరా మార్చిలో అనుమతులు ఇచ్చాయి.ఈ పేర్లు చెప్పుకోని భయాందోళనకు గురి చేసి కోర్టులో ఉన్న కేసులను విత్ డ్రా చేయించారనే అనుమానాలు ఉన్నాయి. ఫినిక్స్ తలుచుకంటే ఎమైనా చేస్తుందని ఈ భూవ్యవహారం చూస్తే తెలుస్తుంది.