- కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ భూములకు రెక్కలు
- ఇండస్ట్రియల్ భూముల్లో రియల్ ఎస్టేట్
- ఫినిక్స్ బినామీకి అమ్మేందుకు హిందూజా దొంగ ఒప్పందం
- 500 మంది బతుకును రోడ్డుపాలు చేసే అవకాశం
- భూముల అప్పగింతకు ఎండీ ప్రమాణిక్ తొలగింపు
- గజం లక్ష యాభై వేల భూమి.. 25 వేలకే ఒప్పందం
- పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్ హోల్డర్స్ కు కుచ్చుటోపీ
- ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్- 20
ఫినిక్స్ భూ భాగోతాలంటేనే ఒడవని ముచ్చట. ఇప్పటికే 19 కథనాలతో ఫినిక్స్ బండారం బట్టబయలు చేసింది తొలివెలుగు. అంతేకాదు.. ఈ అక్రమాలకు ప్రభుత్వ పెద్దలు ఎలా సహకరిస్తున్నారో సవివరంగా కళ్లకు కట్టింది.
ఫినిక్స్ కూకట్ పల్లిలోని ఐడీఎల్ చెరువు పక్కనే ఉన్న జీ.ఓ.సి.ఎల్. కార్పోరేషన్ లిమిటెడ్ (గల్ప్ అయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ) భూములను అప్పనంగా కొట్టేసేందుకు ఏడాదిన్నర క్రితమే ప్లాన్ వేసుకుంది. హైదరాబాద్ కి పరిశ్రమల్లో ఐకాన్ గా ఉండే ఇండియన్ డెటోనటర్స్ లిమిటెడ్ కు అనుకూలంగా పేర్లు మార్చుకుంటూ వచ్చారు. ఫినిక్స్ బినామీలు ఎంటరైనప్పటి నుంచి ఆ కంపెనీల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. అంతేనా.. పెద్ద స్థాయి పదవుల్లో చకచకా మార్పులు మొదలైపోయాయి. ఎంప్లాయిస్ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని, షేర్ హోల్డర్స్ కి నష్టం వాటిల్లొద్దని అనుకున్నవారిని.. చెప్పాపెట్టకుండానే వారిస్థానం నుంచి తప్పించారు .23 యేళ్లుగా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ఎస్. ప్రమాణిక్ కి పదవి పొడగింపు ఇవ్వలేదు.పంకజ్ కుమార్ అనే వ్యక్తిని సీ.ఈ.ఓ. చేశారు. ఇందుకు తెరవెనక చక్రం తిప్పింది ఫినిక్స్ కంపెనీ యజమాన్యమే అని ఆరోపణలు ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సెంజ్ లో స్క్వెయిర్ స్పేస్ ఇన్ప్రా సిటీ లిమిటెడ్, స్క్వెయిర్ స్పెయిస్ ఇన్ప్రా జోన్ ప్రయివేట్ లిమిటెడ్ కి భూములు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
అసలు ఆ భూములు ఎలా తీసుకున్నారంటే..?
1961 నుంచి 1978 వరకు అప్పటి ప్రభుత్వాలు కూకట్ పల్లి లోని సర్వే నెంబర్ 1011/12 మరియు 1012 ల్లో సుమారు 700 ఎకరాల భూమిని గల్ప్ అయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ కు కేటాయించారు. వీటి పేర్లు గతంలో ఇండియన్ డెటోనేటర్స్ లిమిటెడ్, ఐ.డీ.ఎల్. కెమికల్స్ లిమిటెడ్, ఐ. డి.ఎల్. ఇండ్రస్టియల్ గా ఉండేది. ఇండ్రస్టియల్ కు మాత్రమే వాడుకోవాలని 30 మంది దళిత, 101 మంది బంజారా రైతులకు కేటాయించిన భూమిని Memo No. 105254/B/58-11, 58-9 Dated 06-08-1961. వెనక్కి తీసుకొని 99 యేళ్లకు లీజ్ కి ఇచ్చింది. లీజ్ డీడ్స్ డ్యాకుమెంట్స్ నెంబర్ – 366/1964 లో 143 ఎకరాలు, 166/1966,లో 257 ఎకరాలు,905/1969 లో, 2-32 గుంటలు, 1817/1978 లో 137 ఎకరాలు లీజుకు అప్పగించింది. G.O. No. 715 Dated: 05-05-1962. G.O. No. 1953 Dated: 18-12-1962, G.O. No. 1314 28-08-1965 , Memo no. 2912/Q1/75-2 తేది.2-9- 1975 ఉత్తర్వుల ద్వారా భూములు కేటాయించారు. వీటన్నింటికి సింగిల్ ఎజెండా కేవలం పరిశ్రమలకు మాత్రమే వాడుకోవాలని ఉంది.
ఇప్పుడు ఏం చేయబోతున్నారు..!
పరిశ్రమల కోసమే అతి తక్కువ ధరకు భూమి తీసుకున్న గల్ప్ ఆయిల్ కార్పోరేషన్ చట్టానికి విరుద్దంగా 452 కోట్లకు 44.25 ఎకరాల భూమిని అమ్ముకుంటోంది. అదికూడా ఒక్క ఎకరం కేవలం 10 కోట్లు మాత్రమే .. ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎకరం 60 కోట్లు పలుకుతుంటే.. నగరం నడిబొడ్డున.. కూకట్ పల్లికి హై టెక్ సిటీకి వారధిలా ఉండే భూములు ఎకరం పది కోట్లకు అమ్మకం జరుపుతున్నట్లు.. స్వ్కొర్ స్పేస్ ఇన్ఫా సిటీ కి అమ్మేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 2020లో లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పడిన కంపెనీకి.. నాలుగు వందల కోట్ల రూపాయల భూమిని ఇస్తున్నారంటే ఈ బాగోతం వెనక.. తెలంగాణ సర్కార్ బినామీ అయిన ఫినిక్స్ ఉందనటంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని టాక్. అయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావడం.. హిందూజా పూర్తిగా బాధ్యత తీసుకోవడంతో.. ఎక్కడ ఎలాంటి చిక్కులు లేకుండా కోర్టు ద్వారా క్లియర్ చేసుకునేందుకు ఇటు రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అవసరమయితే ప్రత్యేక జీ.వోలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
మరో రియల్ మాఫియా కోసం 32 ఎకరాలు
మరో 32 ఎకరాల భూమిని హిందూజా ఎస్టేట్ వారితో జాయింట్ వెంచర్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. భూ కేటాయింపు జీ.వో.కి పూర్తి విరుద్దంగా ఉన్నా..అప్పట్లో ఎకరాకు వెయ్యి రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం కోరగా.. కేవలం 500 మాత్రమే ఇచ్చారు. అందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసుల విచారణ జరిగింది. W.P NO.24440 OF 2010లో దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. కేటాయించిన భూమి కంటే ఎక్కువ భూమి కబ్జాలో ఉన్నదనే అంశంపై విచారణ జరిగింది. అందుకు నిదర్శనం.. ఇప్పుడు ఆ పక్కనే మరో పదెకరాలు ఆంధ్ర ప్రదేశ్ లో రాజ్యసభ ఎం.పీ.గా ఉండి.. జగన్ కి అంతా తానే అయి చూసుకుంటున్న వారికి 10 ఎకరాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ప్రత్యేక తెలంగాణలో ఏకంగా 42 ఎకరాలను హిందుజా ఎస్టేట్ కి ఇచ్చేసి.. వారి వద్ద నుంచి ఫినిక్స్ బినామి కంపెనీ అయిన స్క్వెయిర్ స్పేస్ కి అంటకట్టడం పై పూర్తి విచారణ జరగాల్సి ఉంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావడంతో అటు షేర్ హోల్డర్స్ మోసం చేస్తున్నారు. మరో వైపు 500 మంది ఉద్యోగులను రోడ్ల పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటగా 42 ఎకరాలు క్లియర్ చేసుకొని ఆ తర్వాత 700 ఎకరాలకు ఎసరు పెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజా ప్రతినిధి, ప్రతిపక్ష నేత ఒకరికి అన్నీ తెలిసినా.. ఎక్కడా నోరు మెదపడం లేదనే విమర్శలు ఉన్నాయి.
బినామీలను గుర్తించిన తొలివెలుగు
తొలివెలుగు క్రైం బ్యూరో నుంచి భూ బకాసురులు.. ఎంతటివారైనా సరే తప్పించుకోలేరు. ఎవరికి ఎలా లింకులు ఉన్నాయో .. మొత్తం ఆధారాలతో సహా ఇట్టే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తొలివెలుగు. ఇప్పటికే.. ఫినిక్స్ కంపెనీలన్నింటికి ఆథరయిజ్డ్ సంతకాలు పెట్టేందుకు తిరుగుతున్న గడ్డం మురళీధర్.. ఈ స్క్వెయిర్ స్పేస్ కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్న సంగతి తొలివెలుగుకు తెలిసింది. అంతేనా…ఇంకా ఎవరెవరు.. ఎలా చేరారు ..ఎందుకు చేరారో ..వారి నుంచి ఎవ్వరికి ఎలా ప్రయోజనం చేకూరుతుందో.. అన్ని మరో కథనంలో చూద్దాం.