– కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ భూఫిక్సింగ్ పై..
– జనవరిలో తొలివెలుగు కథనాలు
– ఆధారాలతో సహా వివరించడంతో..
– తోక ముడిచిన ఫినిక్స్
– సైలెంట్ గా భూముల అమ్మకం
– రూ.450 కోట్లకు కొట్టేసి రూ.3వేల కోట్లు ఆశించిన ఫినిక్స్
– తొలివెలుగు దెబ్బతో రూ.14వందల కోట్లకే అమ్మకం
– పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాటాదారులకు కుచ్చుటోపీ
– ఇండస్ట్రియల్ జోన్ ని మల్టీపర్పస్ జోన్ గా..
– మార్చిన టీఆర్ఎస్ సర్కార్
– రూ.50 వేల కోట్ల భూ స్కాంకి లైన్ క్లియర్
– తొలివెలుగు క్రైంబ్యూరో చేతిలో సాక్ష్యాధారాలు
– ఫినిక్స్ భూ ఫిక్సింగ్.. పార్ట్-27
క్రైం బ్యూరో, తొలివెలుగు:తొలివెలుగు దెబ్బకు ఫినిక్స్ కూసాలు కదులుతున్నాయి. జరుగుతున్న ప్రతీ క్రైం కథను కళ్లకు కట్టినట్టు కథనాలు ఇస్తుండడంతో పెట్టా బేడా సర్దేస్తోంది. కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ భూముల వ్యవహారమే అందుకు నిదర్శనం. గల్ప్ ఆయిల్ కార్పొరేషన్(పాత పేరు ఐడీఎల్)కి చెందిన 700 ఎకరాల భూములను ఫినిక్స్ ఇండియా కంపెనీ కోట్టేసేందుకు భారీ స్కెచ్ వేసింది. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్ లో రూ.50 వేల కోట్ల వరకు ఉంటుంది. కానీ.. కేవలం రూ.7 వేల కోట్లకే భూములు ఇచ్చేందుకు పావులు కదిలాయి. మొదటగా 41 ఎకరాల భూమిని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లో మేజర్ షేర్ హోల్డర్ అయిన హిందుజా కంపెనీ అమ్మకానికి పెట్టింది. ఎకరం రూ.10 కోట్లకు అమ్మేసినట్లు స్టాక్ మార్కెట్ కి సమాచారం ఇచ్చింది. కూకట్ పల్లి-హైటెక్ సిటీకి మధ్యలో ఉన్న ఈ భూమి ఒక ఎకరం రూ.70 కోట్లు పెట్టినా దొరకదు. కానీ.. అందరూ బ్యాక్ డోర్ తెరుచుకుని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో షేర్ హోల్డర్స్ ని మోసం చేశారు. 1964లో ఈ భూములన్నీ దళితులకు, గిరిజనులకు అసైన్డ్ చేశారు. వారి వద్ద నుంచి తీసుకొని ఇండస్ట్రియల్స్ కి అతి తక్కువ ధరకు కేటాయించారు. భారత రక్షణ శాఖకు అవసరమయ్యే సామాగ్రి తయారు కావడంతో ఈ భూములన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోయాయి. కానీ.. హిందుజా దొంగట, టీఆర్ఎస్ సర్కార్ బినామీ కంపెనీ ఫినిక్స్ మ్యాచ్ ఫిక్సింగ్ తో చేతులు మారుతున్నాయి.
దెబ్బకు తొక ముడిచింది
హిందుజా నుంచి 41 ఎకరాలను రూ.450 కోట్లకు ఫినిక్స్ తన బినామీలను డైరెక్టర్స్ గా పెట్టి అక్రమంగా కొనుగోలు చేసింది. ఈ వార్తను ఈ ఏడాది జనవరి 14న తొలివెలుగు ప్రచురించింది(అప్పటి వార్త కోసం https://tolivelugu.com/phoenix-land-scam-part-20/ ఈ లింక్ ను క్లిక్ చేయండి). అదే నెలలో వారం రోజుల తర్వాత ఫినిక్స్ తన బినామీ అయిన గడ్డం మురళీదర్ ని తప్పించి.. ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీ సంస్థ యజమాని రాజమౌళి శ్రీనాకి, బిగ్ సీ మొబైల్ పార్ట్నర్ బాలచంద్రుడు మెప్పర్లకు అమ్మకం జరిపింది. అంతకుముందే బిగ్ సీ లాట్ ముబైల్స్ కో పౌండర్ స్వప్న కుమార్ ని డైరెక్టర్ గా చేర్చుకున్నారు. ఫినిక్స్ వ్యవహారంపై తొలివెలుగు క్రైంబ్యూరో వార్తలు రాయడం మొదలు పెట్టడం.. అప్పటికే 10 ప్రాజెక్ట్ లో అక్రమాలు బయటపెట్టడంతో కూకట్ పల్లి నుంచి మొదటి దశగా వెయ్యి కోట్ల లాభంతో బయటపడింది. రూ.10 కోట్లకు ఎకరం కొనుగోలు చేసి రూ.33 కోట్ల చొప్పున అమ్మేసింది. తొలివెలుగు కథనాలు ఇవ్వకుంటే మరో రూ.15 వందల కోట్ల లాభంతో అమ్ముకునే అవకాశం ఉండేది.
మాస్టర్ ప్లాన్ మార్పుతో భారీ లబ్ది
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ లో ఐడీఎల్ ఇండ్రస్టీ ఉండటంతో 800 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్ గా ఉంది. అనుమతులు రావాలంటే మల్టీపర్పస్ జోన్ గా మార్చాలి. టీఆర్ఎస్ సర్కార్ ఇంకా కంపెనీ నడుస్తుండగానే అలా మార్చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఢిల్లీ పెద్దలను సైతం గులాబీ నోట్లతో కొట్టారని వినికిడి. లోకల్ గా ఎంపీగా ఉన్న ప్రతిపక్ష నేతను బుట్టలో వేసుకున్నారు. ఇంకేముంది.. మొదటి దశగా 41 ఎకరాల భూమి అక్రమంగా చేతులు మారింది. ఇప్పుడు ఆ భూమిని అంతా చదును చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే డెవలప్ మెంట్ చేసుకుని అపార్ట్ మెంట్లు నిర్మించనున్నారు. అలాగే మరో 90 ఎకరాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా 700 ఎకరాలను దశల వారీగా దర్జాగా దోచుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
కూకట్ పల్లిలోని గల్ఫ్ ఆయిల్ భూముల్లో టీఆర్ఎస్ బినామీ కంపెనీ ఫినిక్స్ కథ ఇంకా ఖతం కాలేదు. స్వేయిర్ స్పేస్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్స్ మార్చి వెయ్యి కోట్లు కొల్లగొట్టారు. మిగితా భూమి కోసం బినామీ డైరెక్టర్లతో స్వేయిర్ స్పేస్ ఇన్ఫ్రా జోన్ పేరుతో ఫినిక్స్ తన దొంగచాటు వ్యవహారాన్ని ఎలా నడిపించబోతుందో.. ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్-28లో చూద్దాం.