ఫినిక్స్ భూ ఫిక్సింగ్ :పార్ట్ -6
– ఫినిక్స్ భూ ఫిక్సింగ్ ..శ్రీధర్ మహిమ
– 2018 దాకా కూకట్ పల్లిలో ఓ పాత ఫ్లాట్ లో!
– అనతికాలంలో 14 ఫినిక్స్ కంపెనీల బాస్
– వివాదాస్పద ప్రాజెక్ట్ కి..కళ్లు,చెవులు ఈ రావే!
– ఈ రావును సృష్టించిన ఆ రావ్ ఎవరు?
– బినామీ యాక్ట్ ఈ రావుకు వర్తించదా!
భోగి శ్రీధర్ రావు అలియాస్ శ్రీధరా రావు.ఫినిక్స్ కంపనీలో పనులు చకచకా కావాలంటే ఈ పేరు చెప్తే చాలు. తెలంగాణలో ఫినిక్స్ నిర్మాణ సంస్థకు భోగ భాగ్యాలు కల్పించింది ఈ భోగి శ్రీధర్ రావే అని చెప్పొచ్చు.అత్యంత వివాదస్పద భూముల్లో ఈయన ఉత్సవ విగ్రహంలా ఉంటే చాలు ..పనులు వాటంతట అవే ఉరుకులు పరుగుల మీద జరిగిపోతాయి.అధికారులు హుటాహటిన పరుగెడుతారు.ఎంత క్లిష్టమైన పనులు అయినా ఇట్టే..చేసిపెడతారు. చేసి తీరాల్సిందే.. లేదంటే ఆ అధికారి పోస్ట్ సాయంత్రంలోపు గల్లంతే.
ఎవరీ శ్రీధర్ రావు.?
భారీ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ఫినిక్స్ సిస్టర్స్ కంపనీల్లో ..ఇంతలా రెచ్చిపోతున్న ఈ శ్రీధర్ రావు ఎవరనే అనుమానం రాక మానదు. మనిషి మాములుగా ఉన్నా.. పేరు మాత్రం వెరీ పవర్ ఫుల్.
ఎవరైనా వచ్చేప్పుడు ఏమీ తీసుకురారు..పోయేప్పుడు ఏమీ తీసుకుపోరు..అనేది శ్మశాన వైరాగ్యం.మహాప్రస్థానం దందా నిర్వహించే ఫినిక్స్ కంపెనీ శ్రీధర్ రావు కూడా…ఉత్తరాంధ్ర నుంచి వచ్చేప్పుడు ఏమీ తీసుకురాలేదు.కానీ..వచ్చిన కొద్దికాలంలోనే కోట్లకు పడగలెత్తాడు.అనామకుడిగా హైదరాబాద్ వచ్చాడు.కూకట్ పల్లి వసుధా రెసిడెన్సీ ప్లాట్ నెంబర్ 202లో 2018 వరకు ఉండేవాడు. అప్పటికే పలు కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నా.. పెద్దగా లగ్జరీ లైఫ్ ఏమీ కోరుకోలేదు. ఏటేటా కంపెనీలు పెరిగిపోవడం.. ఆస్తులు వచ్చి పడుతుండటంతో.. ఆ ఏరియా సేఫ్ కాదనుకున్నాడు. కొనుగోలు చేసిన ప్లాట్ ని తన బావమరిదికి ఇచ్చేసి కాస్ట్లీ ఎరియాకు షిప్ట్ అయ్యాడు. ఈయన తెలంగాణలోని ఓ పార్టీ కీలక నేతకు,మంత్రికి దూరపు బంధువు. మంత్రిగారి భార్య మూలాలు ఆంధ్రలో ఉండటంతో అక్కడి వారికి ప్రాధాన్యత పెరిగిందని వినికిడి. సదరు శ్రీధరారావు ఫోటో ఎక్కడా సోషల్ మీడియాలో దొరకదు. ఈ పెద్దమనిషి అన్ని కంపెనీలకు డైరక్టర్ గా ఉన్నా..కనీసం మినిస్ట్రీ ఆఫ్ కంపెనీస్ లోనూ కనిపించదు.అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మరి.కానీ..తొలివెలుగు పరిశోధనలో భాగంగా..మూడు నెలలు గాలిస్తే..అయ్యగారి ఫోటో దొరికింది.
ఫినిక్స్ లో..ఫిక్స్ అయిందిలా !
తెలంగాణ వచ్చిన తర్వాత 6 నెలల్లోనే శ్రీధర్ రావుకు ఫినిక్స్ కి మధ్య బలమైన బంధం కుదిరింది. 2014 డిసెంబర్ లో ఫినిక్స్ టెక్నోసిటి ప్రయివేట్ లిమిటెడ్ కంపనీలో అడిషనల్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి తిరిగి చూడకుండా 14 కంపనీల్లో డైరెక్టర్ అయ్యాడు. ఏ ఒక్క కంపనీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టింది లేదని లెక్కలు చెప్తున్నాయి. కాని ఆ కంపెనీలు చేపట్టే ప్రాజెక్టులు మాత్రం వేలకోట్లలోనే ఉంటాయి. సదరు శ్రీధరా రావు కంపెనీల లిస్ట్ ఇలా ఉంది.
1. డిసెంబర్ 03, 2014న PHOENIX IT HUB PRIVATE LIMITED లో అడిషనల్ డైరెక్టర్.
2 సెప్టెంబర్ 1, 2017న PHOENIX MINES & MINERALS (INDIA) PRIVATE LIMITED
3. సెప్టెంబర్ 1, 2017న PHOENIX SPACETECH DEVELOPERS PRIVATE LIMITED
4. ఏప్రిల్ 16 2018 న PHOENIX TECHNO HUB PRIVATE LIMITED
5. ఎప్రిల్ 20, 2018 PHOENIX GLOBAL TECH CITY PRIVATE LIMITED
6. మార్చి 27, 2018,PHOENIX INFRASPACE INDIA PRIVATE LIMITED
7. మార్చి 28, 2018 PHOENIX INFRASOFT INDIA PRIVATE LIMITED
8. మార్చి 25, 2019 PHOENIX IT SPACES PRIVATE LIMITED
9. మే 27 2019లో PHOENIX INFRA ZONE PRIVATE LIMITED
10.ఆగష్ట్ 23, 2019 లోPHOENIX IT ZONE PRIVATE LIMITED
11. జూన్ 20,2019 PHOENIX SEZ SPACES PRIVATE LIMITED
12. ఆగష్ట్ 23, 2019న PHOENIX TECH DEVELOPERS PRIVATE LIMITED.
13. జూన్ 20 2019 న PHOENIX TECHNO CITY PRIVATE LIMITED
14.. జనవరి 29, 2020న PHOENIX SEZ DEVELOPERS PRIVATE LIMITED.
ఇలా 14 కంపనీల్లో డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. 2014లో ఒక్క కంపెనీలో ఉండే వ్యక్తి.. 2017లో రెండు కంపెనీలు, 2018లో 4 కంపెనీలు, 2019లో 6 కంపెనీల్లో, 2020లో ఒక కంపెనీలో డైరెక్టర్ గా చేరిపోయాడు. ఫినిక్స్ కాకుండా మరో 5 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నాడు. ఫినిక్స్ కి వివాదాలే పెట్టుబడులు.. పార్ట్ 7లో Phoenix IT Spaces Pvt. Ltd పేరుతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి 7 కిలోమీటర్ల 41 ఎకరాల్లో భూ దందా కొనసాగుతుంది. భారీ అంచనాలతో ఓపెన్ ప్లాట్స్ విక్రయించేందుకు సిద్దమయింది. హైకోర్టులో కేసులు లెక్క చేయకుండా రేరా ఏం చేసింది. అసలు ఆ భూములు ఎవరివి.. ఎలా దక్కించుకున్నారో పార్ట్ 7 ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ లో చూద్దాం.