దిషా ముందు జాగ్రత్తే ఈ కేసులో నిందితులను పట్టించింది! కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఆధారంగా నిలిచింది. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు ఆమె మొబైల్ కీలకంగా మారింది. ప్రియాంక ఫోన్ రా.9.48 గంటకు స్విచ్ఛాఫ్ అయింది. ఆమె తన సోదరితో మాట్లాడిన తర్వాత మరొకరికి ఫోన్ చేసినట్లు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. అది ఎవరిదని ఆరా తీశారు..తన స్కూటీ రిపేర్ చేయించడం కోసం అని దగ్గరకు వచ్చి సాయం చేస్తామని నమ్మబలికిన ఆరిఫ్ స్కూటీ తీసుకొని వెళ్ళేటప్పుడు ముందు జాగ్రత్త చర్యగా అతడి నెంబర్ ను తీసుకుంది.అయితే స్కూటీ తీసుకెళ్లిన ఆరిఫ్ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడం తో ప్రియాంక అతడి నెంబర్ కు కాల్ చేయడం అది ఆమె ఫోన్ కాల్స్ లో రికార్డ్ అవ్వడం తో పోలీసులు ఈ కేసు ను ఛేదించడం లో సాయ పడినట్లు అయ్యింది.ఫోన్ నంబర్ ఆధారంగా లారీ డ్రైవర్ మహ్మద్‌ను గుర్తించారు. లారీలో తనిఖీ చేయగా, రక్తపు మరకలు, ఇతర ఆధారాలు దొరికాయి. వెంటనే మహ్మద్ ఇంటికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ప్రియాంక చివరి ఆలోచనే నిందితులను పక్కాగా ఇరికించేసింది. హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మక్తల్ మండలం జక్లేరుకు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా, మక్తల్ మండలం గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను పోలీసులు అరెస్ట్ చేశారు.