ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ ఫోన్లు అన్ని కూడా బంద్ అయ్యాయి. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రొవైడర్లు సర్వీసును ఆపివేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నాయి. ఈ సమయంలో ఫోన్లు పనిచేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
సమాచార శాఖలోని ముఖ్య అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి ఫోన్లు బంద్ అయ్యాయి. దీంతో అధికారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలా ఫోన్ లు బంద్ కావటం రెండోసారి అవ్వటం విశేషం.