– ఫినిక్స్ దొంగాటలో సరికొత్త మాయ
– ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్..ఫినిక్స్ పరం
– ఏస్ అర్బన్ చొరవకు కారణాలేంటి?
– కాస్ట్ లీ ఏరియాలో 2 ఎకరాలపై నజర్
– సీఐఆర్పీతో ఫినిక్స్ కు భారీగా లబ్ది
తొలివెలుగు క్రైంబ్యూరో,హైదరాబాద్:
మెహుల్ చోక్సీ..పేరున్నవజ్రాల వ్యాపారి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పరారయ్యాడు. ఆర్థిక నేరగాడిగానే చాలా మందికి తెలుసు. అయితే ప్రస్తుతం మెహుల్ చోక్సీకి చెందిన ఏపీ జెమ్స్ అండ్ జువెల్స్ పార్క్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ( సి.ఐ.ఆర్.పి) ద్వారా ఏస్ అర్బన్ లిమిటెడ్ పరం కానుంది.నేషనల కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ఆదేశాల అనుసారం ఈ ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది.
ఎన్వీఆర్ బద్రీనాథ్,ఏ.వీరబ్రహ్మరావులతో కూడిన బెంచ్ దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టడానికి ఆమోదం తెలిపింది.అటు..ఏపీ జెమ్స్ అండ్ జువెల్స్ 107 కోట్ల రుణాలను తీర్చటానికి కూడా ఏస్ అర్బన్ అంగీకరించినట్టు తెలుస్తోంది.ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని చోక్సీ ఏపీ జెమ్స్అండ్ జువెల్స్ కు చెందిన అత్యంత ఖరీదైన రెండెకరాల భూమి,రెండు లక్షల స్క్వేర్ ఫీట్ అయిదంతస్తుల భవనాన్ని2018లొనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసుకుంది.
దివాలా పరిష్కార ప్రక్రియను ఆరంభించాలంటూ “ఫినిక్స్ టెక్ టవర్కంపెనీ నుంచి దరఖాస్తు వచ్చిన వెంటనే.. ఏపీ జెమ్స్ అండ్ జువెల్స్ సి.ఐ.ఆర్.పీ కి రావటం పై లోపాయకారి ఒప్పందం ప్రకారమే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.హైదరాబాద్ వేల కోట్ల ఖరీదు చేసే వివాదాస్పద భూముల్లో ఫినిక్స్ కబ్జా బాగోతాలపై తొలివెలుగు బహిర్గతం చేసింది.కొన్నింటిపై ఇప్పటికే విచారణలు మొదలైనట్లు తెలుస్తోంది.