మన దేశంలో కరెన్సీ నోట్లు అనగానే జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ కనపడుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆయన బొమ్మనే ప్రతీ నోటుపై ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్టు కనపడుతుంది. కొత్త నోట్లలో మన కరెన్సీ లో గతంలో ఎప్పుడూ చూడని కొత్త వ్యక్తులను చూసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని డినామినేషన్ల కొత్త సిరీస్ బ్యాంక్ నోట్లపై రవీంద్ర నాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం ఫోటోలను వాడటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
Also Read:బాలయ్య సినిమాలో.. విలన్ గా తెలుగు హీరోయిన్..!
మన దేశ 11వ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అని పిలువబడే అబ్దుల్ కలాం ఫోటో కనీసం వంద రూపాయల నోట్లపై అయినా ఉండాలనే డిమాండ్ వినపడింది. ఇప్పుడు దీన్ని వాస్తవ రూపంలోకి తెచ్చే ప్రయత్నాలు మొదలైనట్టుగా తెలుస్తుంది. అమెరికా తరహాలో కరెన్సీలో మార్పులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అమెరికన్ కరెన్సీలో జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫెర్సన్, ఆండ్రూ జాక్సన్, అలెగ్జాండర్ హామిల్టన్, అబ్రహం లింకన్‌తో సహా కొంతమంది 19వ శతాబ్దపు అధ్యక్షుల ఫోటోలు ఉంటాయి.
ఆర్‌బిఐ అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌పిఎంసిఐఎల్) గాంధీ, ఠాగూర్ మరియు కలాం వాటర్‌మార్క్‌ల నమూనాల రెండు వేర్వేరు సెట్లను ఐఐటి-ఢిల్లీ ఎమిరిటస్ ప్రొఫెసర్ దిలీప్ టి షాహానీకి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని ప్రభుత్వానికి పంపాల్సిందిగా కోరినట్టు సమాచారం. రెండు వేల నోటుతో పాటుగా మరికొన్ని నోట్లలో చేర్చే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇక నోట్లపై కొందరు ప్రముఖుల చిత్రాలకు సంబంధించి 2017 లో కలకత్తా హైకోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు అయింది. 2017లోనే దీనిపై స్పందించిన కలకత్తా హైకోర్టు… దేశంలోని కరెన్సీ నోట్లలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేదా ఇతర ముఖ్యుల ఫోటోలు ఎందుకు ఉండకూడదో ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం, అలాగే రిజర్వ్ బ్యాంకు కు ఆదేశాలు జారీ చేసింది. 2016 లో దేశంలో కొత్త నోట్లు చెలామణిలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read:మతోన్మాద విద్వేషపూరిత ప్రసంగాలు అవసరమా..!