రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మైలార్ దేవి పల్లిలో బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారు. మొదట బాలికను బెదిరింపులకు గురిచేసి మైలార్ దేవిపల్లి లోని వట్టేపల్లి ప్రాంతానికి దుండగులు తీసుకు వెళ్లారు.
అక్కడ దుండగులు బాలికకు దుండగులు మాయమాటలు చెప్పారు. అనంతరం బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆమెను డబిరిపురా భరత్ నగర్‌కు చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. ఇండ్లలో పని మనిషిగా చేస్తూ బాలిక జీవనం సాగిస్తున్నట్టు చెప్పారు.
చార్మినార్ వద్ద ఓ యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడిందన్నారు. బాలికకు మాయ మటలు చెప్పి ఆ యువకుడు ట్రాప్ చేశాడని, వట్టేపల్లి ప్రాంతానికి తీసుకొని వచ్చి బాలికపై అత్యాచారానికి దుండగులు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
దీనిపై డబీర్ పురా పోలీసు స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను మైలార్ దేవిపల్లి పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసి మైలార్ దేవిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఓ బాలుడు ఉన్నట్టు సమాచారం.