ఇండియాలో రోజుకు దాదాపు లక్ష కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో భారత్ లో మరోసారి లాక్ డౌన్ ఉండబోతుందని, సెప్టెంబర్ 25 నుండి 46రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. జనం అంతా అలర్ట్ గా ఉండాలని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ కేంద్రానికి సిఫారుసు చేసిందని ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్తలు అవాస్తవమని, కేంద్రానికి ఏ సంస్థలు ఏ విధమైన రిపోర్టులు ఇవ్వలేదని పీఐబీ ప్రకటించింది.
Claim: An order purportedly issued by National Disaster Management Authority claims that it has directed the government to re-impose a nationwide #Lockdown from 25th September. #PIBFactCheck: This order is #Fake. @ndmaindia has not issued any such order to re-impose lockdown. pic.twitter.com/J72eeA62zl
— PIB Fact Check (@PIBFactCheck) September 12, 2020
అంతేకాదు అక్టోబర్ 1 నుండి అన్ లాక్ 5.0మొదలుకాబోతున్నందున… సినిమా థియేటర్లు తెరుచుకుంటాయన్న ప్రచారంపై కూడా పీఐబీ ప్రకటన చేసింది. అదంతా కేవలం ప్రచారమేనని, ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని, వదంతులు నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది.
Claim:A Media report has claimed that Home Ministry has ordered reopening of cinema halls across the country from 1st October with the imposition of strict regulations. #PIBFactCheck: This claim is #Fake. No decision has been taken by @HMOIndia on reopening the cinema halls yet pic.twitter.com/hc903cfXnm
— PIB Fact Check (@PIBFactCheck) September 14, 2020