ఆ మధ్య మళయాళంలో ఒక సినిమా వచ్చింది పేరు వికృతి.. సోషల్ మీడియాలో ట్రోల్ అయిన ఒక వ్యక్తి గురించిన కథ.. తన ఫోటో వైరలవడంతో తను,తన ఫ్యామిలి ఎలా సఫర్ అయ్యారనేది కథాంశం.. జస్ట్ నిద్రపోతున్న ఫోటో చూసే రకరకాలుగా ట్రోల్ చేసి వికృతిగా ఉంటే…జర్మనిలో ఒంటి మీద నూలు పోగు లేకుండా పరుగు పెట్టిన వ్యక్తి ఫోటో వైరల్ అయి అందరిని నవ్వించి ప్రకృతిలో భాగం అయింది.. అసలు విషయం ఏంటంటే??
విదేశాల్లో నేకెడ్(నగ్నంగా) సన్ బాత్ చేయడం సహజమే..కానీ నేకెడ్ గా పరుగులు పెట్టడం కొంత వింతే..జర్మనిలో ఒక వ్యక్తి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ సన్ బాత్ చేస్తున్నాడో ఒక వ్యక్తి..ఇంతలో అటుగా వచ్చిన ఒక అడవిపంది తన పక్కనే ఉన్న ఎల్లో కలర్ బ్యాగ్ పట్టుకుని పరుగుతీసింది.. దాని వెనుకే బుజ్జి పంది పిల్లలు కూడా పరుగుపెట్టాయి.. తన ఒంటి మీద బట్టలు లేవన్న విషయం కూడా గమనించకుండా వాటి వెనుక పరుగు పెట్టాడు ఆ పెద్దమనిషి..
ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముందంటే , తన విలువైన వస్తువులు ల్యాప్టాప్, వాలెట్ అన్ని అందులోనే ఉన్నాయి..వాటి కోసం పరుగుపెట్టాడు.. చుట్టూ ఉన్న జనం నవ్వుల్లో మునిగిపోయారు..చివరికి ఎలాగోలా తన బ్యాగ్ ని సంపాదించుకున్నాడు.. బ్యాగ్ పట్టుకుని తిరిగి వస్తుంటే అందరూ అతన్ని చప్పట్లతో వెల్కం చెప్పారు..ప్రస్తుతం అతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి..
ఆ విధంగా పరిగెత్తినందుకు అతన్ని ట్రోల్ చేసేవారు కొందరైతే, మమ్మల్ని నవ్వించినందుకు థ్యాంక్స్ చెప్తున్నవారే ఎక్కువమంది..ఏదైనా మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది..ట్రోలింగ్స్ ని లైట్ తీస్కుంటూ తన మూలంగా కాసేపు నవ్వుకున్నవాళ్లను చూసి హ్యాపీగా ఫీలవుతున్నాడట పేరు తెలియని పెద్ద మనిషి..!