కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎలాంటి అనుమతులు లేకుండానే 3వ టీఎంసీ నీటిని పైప్ లైన్ సిస్టం ద్వారా తరలించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరమ్ కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
3వ టీఎంసీ తరలింపు వల్ల ప్రభుత్వంపై 8వేల కోట్ల అదనపు భారం పడుతుందన్న పిటిషనర్… ఇప్పటి వరకు 2 టీఎంసీల నీటి తరలింపు ప్రక్రియ ను కెనాల్ గ్రావిటేషనల్ టన్నల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారా తరలించారని కోర్టుకు తెలిపారు. వీటి వల్ల ప్రతి ఏటా వేయి కోట్ల రూపాయల మెంటనెస్ ఖర్చు అవుతుందని పిటిషనర్ వాదించారు. 3 టీఎంసీ పైప్ లైన్ పద్ధతి ద్వారా తరలిస్తే భూ సేకరణ సమస్య తో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయన్న పిటిషనర్..మూడో టీఎంసీ నీటి తరలింపు పాత పద్ధతి ద్వారానే పనులు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం లో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మిచొద్దన్ని ప్రభుత్వానికి ఎన్జీటీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని కోర్ట్ కు తెలిపిన పిటిషనర్ మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కు కాలువల ద్వారానే పనులు జరగాయన్నారు. పిటిషనర్ వాదనలు విన్న కోర్టు ఐదుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం, కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇర్రిగేషన్. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్.మినిస్టర్ ఇన్విరారమెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ శాఖలకు నోటీసులు జారీ అయ్యాయి. నాలుగు వారాల్లో దీని పై పూర్తి ని వేదిక సమర్పించాలని ప్రతివాదులకు హైకోర్ట్ ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.