తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలతో పాటు, రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.
ఈ రిజర్వేషన్లు కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్‌లో మాత్రమే అమలు చేస్తున్నారని.. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ వంటి ఇతర కోర్సుల్లో అమలు కావడం లేదని కోర్టుకు తెలిపారు. కోటా కింద 10శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ 2019లో రాజ్యాంగ సవరణ చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం వంటి కేంద్ర విద్యా సంస్థల్లో అమలు అవుతుందని, కానీ రాష్ట్రంలో అమలు కాకపోవడం వల్ల ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు నష్టపోయారని అన్నారు.
దీనిపై కోర్టు విచారణ చేపట్టనుంది.