హెలికాఫ్టర్లు, విమాన ప్రమాదాలకు పైలట్ల తప్పిదాలే కారణమని ఓ అధ్యయనంలో తేలింది. అరుణాచల్ ప్రదేశ్ లో బొమ్ డిలా వద్ద ఇటీవల ఛీతా హెలికాఫ్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఇలాంటి ఘటనలకు చాలావరకు మానవ తప్పిదాలే కారణమని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో బాటు అమెరికాకు చెందిన నేషనల్ కమిషన్ ఆన్ మిలిటరీ ఏవియేషన్ కూడా అభిప్రాయపడింది. సుమారు 88 కేసుల్లో ఇలా జరిగిన విషయాన్ని ఈ సంస్థలు నిర్ధారించాయి.
\గత అయిదు దశాబ్దాల కాలంలో జరిగిన ఘటనలను ఈ సంస్ధలు విశ్లేషించాయి. కొన్ని సందర్భాల్లో హెలికాఫ్టర్లు, విమానాల డిజైన్, వాటి ఉత్పాదకతలో లేదా మెయింటెన్స్ లో లోపాలు వంటివి ఈ ప్రమాదాలకు కారణమవుతున్నా.. చాలావరకు పైలట్ల తప్పిదాలే ఇందుకు కారణమని ఈ సంస్థలు వివరించాయి. ప్రపంచ వ్యాప్తంగా 2012-2021 మధ్య జరిగిన ప్రమాదాల్లో ..ముఖ్యంగా 62 కేసుల్లో పైలట్లు తీసుకున్న పొరబాటు నిర్ణయాలే ఈ యాక్సిడెంట్లకు దారి తీశాయని గత ఏడాది ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ సేఫ్టీ రిపోర్ట్ పేర్కొంది.
పైలట్లు కావాలనే తప్పుడు నిర్ణయాలు తీసుకోరు . , వాతావరణం బాగులేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 2001 లో యూపీలో జరిగిన ఇలాంటి ఘటన లో కాంగ్రెస్ నేత మాధవరావు సింద్జియా, ఉమ్మడి ఏపీలో 2009 లో హెలికాఫ్టర్ కూలి అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లోనూ వాతావరణం బాగులేకపోవడమే ఇవి జరిగాయి అని ఈ నివేదిక వివరించింది.
పైలట్ల సైకలాజికల్ నిర్ణయాలు కూడా ఒక్కోసారి తీవ్ర ప్రభావం చూపుతాయని, వారి విజ్ఞానం కన్నా తమ విశ్వాసంపై వారి నిర్లక్ష్యం సైతం ఈ విధమైన ఘటనలకు కారణమవుతున్నాయని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జీఎస్. బేడీ కూడా ఓ విశ్లేషణలో వివరించారు. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ విధమైన సంఘటనలను ఆయన పేర్కొన్నారు.