ఎలిఫెంట్ విస్పర్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ దక్కించుకోవడంతోనే అయిపోలేదు. ఆ ప్రయత్నానికి ప్రజలు దాసోహం చేస్తున్నారు. బొమ్మన్, బెల్లీ, ఎలిఫెంట్ బేబీ రఘు పేర్లు ఇంటింటా మార్మోగుతున్నాయనడం అతిశయోక్తి కాదు.
ఇక బొమ్మన్, బెల్లీ ఇటీవల ఊటీకి విమానంలో ప్రయాణిస్తుండగా ఇండిగో పైలట్ వారిద్దరి గురించి గొప్పగా ప్రస్తావించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఉద్వేగభరిత వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు షేర్ చేయగా నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది. బొమ్మన్, బెల్లీ గౌరవార్ధం పైలట్ విమానంలో అనౌన్స్ చేసిన వీడియో పలువురి హృదయాలను తాకింది.
ఎలిఫెంట్ విస్పర్స్ బృందం మనతో ప్రయాణించడం మనందరికీ గర్‌్కారణం..వారిని చప్పట్లతో స్వాగతించండని పైలట్ అనౌన్స్ చేశారు. దీంతో ప్రయాణీకుల హర్షధ్వానాల మధ్య జంట తమ సీట్ల నుంచి లేచి అందరికీ అభివాదం చేశారు.
ప్రయాణీకులు తమ మొబైల్ ఫోన్లలో ఈ ఘటనను రికార్డు చేశారు. ఇండిగో అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ ట్వీట్‌పై స్పందిస్తూ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు పొందేందుకు అర్హత కలిగిన ఎలిఫెంట్ విస్పర్స్ టీం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని పేర్కొంది.
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన ఎలిఫెంట్ విస్‌్ర్స్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.