కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలని, మన విజయాన్నివారికి చూపించాలని అందరికీ ఉంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
అలాంటి అవకాశం ఓ పైలట్ కు దక్కింది. ఓ భారతీయ పైలట్ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను పైలట్ తన ఇన్‌స్టా అకౌంట్ ‘దేశీపైలట్11’ లో షేర్‌చేశారు. ఆ పైలట్ తల్లిదండ్రులిద్దరూ జైపూర్ వెళ్లేందుకు ఓ విమానం ఎక్కుతారు.
విమానంలోకి ఎంటర్ అవ్వగానే వారి కొడుకు కనిపిస్తాడు. ఆ విమానం నడిపేది తమ కొడుకే అని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. కొడుకును చూసి గర్వపడతారు. ‘నేను విమానం నడపడం ప్రారంభించినప్పటినుంచీ దీని కోసమే ఎదురుచూశాను’ అని ఆ పైలట్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ ఆనందకరమైన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఇప్పటివరకూ 2.8 మిలియన్ల వీక్షణలు పొందింది. ఈ వీడియోను లక్షకుపైగా మంది లైక్ చేశారు.