భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ ఏరియాలో కుప్ప కూలింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు.ఈ ఘటనలో పైలట్ ఒకరు మృతి చెందారు.
సమాచారం అందుకున్న అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దించాయి. గాయపడిన ఇద్దరు పైలట్‌లను వెంటనే సమీపంలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించాయి. చికిత్స పొందుతూ పైలట్ లెఫ్టి కల్నల్ సౌరభ్ యాదవ్ మరణించారు.
మరో పైలట్‌కు చికిత్స అందిస్తున్నారు. హెలిక్యాప్టర్ ప్రమాదానికిగల కారణాల ఇంకా తెలియరాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక 1976 నుంచి చీతా హెలిక్యాప్టర్‌లను హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది.
ఈ హెలిక్యాప్టర్‌లను బారత సైన్యంలో వివిధ రకాల సేవల కోసం వినియోగిస్తున్నారు. మిగతా హెలిక్యాప్టర్లతో పోల్చితే ఇవి చాలా ఎత్తుకు ఎగరగలవు. సైన్యానికి చెందిన స్థావరాలపై గస్తీ నిర్వహణలో, విపత్తుల సందర్భంగా రక్షణ, సహాయక చర్యల్లో వీటిని అధికంగా ఉపయోగిస్తున్నారు.