సినిమాలు అన్నాక పొరపాట్లు జరగడం సహజం. సాధారణంగా వాటిని చాలా మంది గుర్తించలేరు. ఏదో ఫ్లోలో అలా సినిమా చూస్తూంటారు. విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కెరీర్ లో ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్. ఈ చిత్రం ఎన్నిసార్లు చూసినా.. చూడాలి అనిపిస్తుంది. కామెడీకి కామెడీ.. సెంటిమెంట్స్ సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే ఈ చిత్రాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ.. అందులో జరిగిన ఈ పొరపాటును ఇప్పటి వరకు గమనించలేదు. అదేంటంటే.. ఈ సినిమాలో వెంకీ వాళ్ళ నాన్న స్నేహితుడి ఇంటికి ఉద్యోగం కోసం వస్తాడు.
ఈ తరుణంలో వెంకీకి ఆయన తండ్రి ఉత్తరం రాయగా.. అది హీరోయిన్, ఆమె చెల్లెలి చేతికి వెళ్తుంది. అలా ఉత్తరం తెచ్చుకోవడానికి వెంకీ వాళ్ల దగ్గరకు వెళతాడు. అప్పుడు తన పేరు పింకీ అని, తను లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నానని పరిచయం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే పింకీ స్కూల్ కి వెళ్లే సమయంలో తోటి స్టూడెంట్స్ తో చిన్న గొడవ జరుగుతుంది. అప్పుడు వెంకీ వచ్చి వాళ్ల భరతం పట్టి.. స్కూల్ బస్ లో పింకీని ఎక్కించి పంపిస్తాడు.
అయితే స్కూల్ బస్ మీద పేరు B.V.B.P SCHOOL అని ఉండగా, పింకీ చెప్పిన స్కూల్ పేరుకి దీనికి అస్సలు మ్యాచ్ కాలేదు. షార్ట్ కట్ లో రాశారేమో అనుకుంటే, అక్కడ ఉన్న లెటర్స్ కూడా పేరుకి మ్యాచ్ అయ్యేలా లేవు. ఇలాంటి తప్పులు ఇందులో చాలానే ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. అయితే చాలా సినిమాలలో మనం ఈ తప్పులను గమనిస్తూనే ఉంటాం. కానీ పెద్దగా పట్టించుకోరు.
సినిమా నచ్చాలేగానీ ఇలాంటి తప్పులను ప్రేక్షకులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఇక ఈ సినిమా 3 గంటల 12 నిమిషాలు నిడివితో 2001 సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మొదటిగా సినిమా లెంగ్త్ ఎక్కువైపోయిందని అన్నారు. సినిమాలోని సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమని అన్నారు. కానీ రవికిశోర్ పట్టుదలతో సినిమాలోని ఒక్క బిట్టును కూడా కట్ చేయలేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Also Read: సలార్ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్!