రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా.. భారీ అంచనాల మధ్య మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. గత రికార్డులను తిరగరాస్తూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ఉద్యమ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో హీరోలు ఇద్దరు జీవించేశారు. వీరిద్దరి నటనకు ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు. అయితే, ఆర్ఆర్ఆర్‌కు పైరసీ నుంచి పెద్ద షాక్ ఎదురైంది. కొందరు వ్యక్తులు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఫుల్ హెచ్‌డీ లీక్ కావడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా పోస్టు పెడుతూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటం కాదు. ముందు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియోను డిలీట్ చేయించి, లీకుల పర్వం ఆగే విధంగా చూసుకోవాలని సూచించాడు. దీంతో పైరసీ దారులను బర్రెలతో పోల్చుతూ సమాధానం ఇచ్చారు ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్.
దీనిపై ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం స్పందించింది. ”మేము తీస్తూనే ఉన్నాం.. బర్రెలు వేస్తూనే ఉన్నాయి” అంటూ లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ పేడ తీస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇక థియేటర్స్‌లోనూ ఈ సినిమా అదరగొడుతుంది.
Memu Theesthaane Unnaam.. Buffaloes Pedathaaane Unnaayi… pic.twitter.com/ghMOmyqvVN
— RRR Movie (@RRRMovie) April 3, 2022
Advertisements