ఎప్పటినుంచో భీమ్లా నాయక్ ట్రైలర్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సోమవారం ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై పవన్ ను చూసేందుకు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే ట్రైలర్ లో రానా ను హైలెట్ చేస్తూ చూపించారు మేకర్స్. దీనితో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అంతే కాదు ప్రేక్షకులందరూ కూడా ఒరిజినల్ ట్రైలర్ పై దృష్టి పెట్టారు.
మాతృకలో అయ్యప్పన్, కోశి ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాదించటానికి చూస్తూ ఉంటారు. అలాగే మేకర్స్ కూడా రెండు పాత్రలను సమానంగా చూపిస్తారు.కానీ ఇక్కడ భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్, ప్రోమోలు, టీజర్‌లో పీకే ని హైలైట్ చేశారు మేకర్స్. టైటిల్ కూడా భీమ్లా నాయక్ అంటూ వన్ సైడ్ పెట్టారు.
కానీ ఇప్పుడు, ట్రైలర్ లో రానాపై దృష్టి పెట్టారు. పీకే టీజర్‌లో బలంగా కనిపించగా, ట్రైలర్ లో రానా హైప్ ఎక్కువ అయింది. దీనితో పీకేని తక్కువగా చూపించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఫిబ్రవరి 25 వరకు ఆగాల్సిందే.