ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికల ఫలితాలపై ఓ అవగాహన ఇస్తున్నాయన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఖండించారు.
లోక్ సభ ఎన్నికలు 2024లో జరుగుతాయని, ఈ ఫలితాలకు ఆ ఎన్నికలతో సంబంధం లేదని ఆయన వెల్లడించారు. అప్పటి ఫలితం అప్పుడే వెలుపడుతుందని ఆ విషయం సాహెబ్(మోడీ)కి తెలుసన్నారు.
ఈ ఫలితాలకు సార్వత్రిక ఎన్నికలతో ముడిపెట్టి ప్రతిపక్షాలను ఆందోళనకు మోడీ గుర్తి చేయాలని అనుకుంటున్నారని పీకే అన్నారు. ఆయన పన్నిన వ్యూహంలో చిక్కుకుపోకండంటూ ప్రతిపక్షాలకు సూచన చేశాడు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద నష్టమేనని తెలిపారు. ఈ ఫలితాలు 2024 ఎన్నికలను ప్రభావితం చేస్తాయనడం సరికాదన్నారు. బీజేపీని ఎదుర్కోవాలనుకునే అన్ని పార్టీలూ కలిసి పోరాడాలన్నారు.