– కారు బోరుకొచ్చిందా..!
– గులాబీ కారుకు విడిభాగాలు అవసరమా!
– సారు..కారు..పీకే గ్యారేజ్ ఖరారు!
– మరి పాతభాగాల పరిస్థితి ఏంటి?
– పాతభాగాల రీయూజే..జిల్లా అధ్యక్షుల రూపమా!
కారును పికె గ్యారేజ్ లో సర్వీస్ కి ఇచ్చిన కెసిఆర్..కార్ లో లోడ్ ఎక్కువై టైర్లు ఆరిగాయి, బ్యాటరీ డౌన్ అయ్యింది.ఇంజన్ కూడా సర్విస్ కి వచ్చింది అని ఓనర్ కు చెప్పిన మెకానిక్ పీకే. టైర్లు..బ్యాటరీ లతో పాటు కొన్నివిడిభాగాలు మార్చుకోవాలి. అప్పుడే కారు నడుస్తుంది అని తేల్చి చెప్పడంతో పూర్తి స్థాయి రిపేర్ కు సిద్దం ఆయిన కెసిఆర్.అందులో భాగంగానే జిల్లా అధ్యక్షులుగా ఎంఎల్ఏ,ఎంపి,ఎంఎల్ సి ల నియామకం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఎమ్మెల్యేలనే జిల్లా అధ్యక్షులు గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరనే అనుమానం వస్తుంది అని,కొన్నిజిల్లాలలో ఎంఎల్ సి,ఎంపి లను కూడా జిల్లా అధ్యక్షులు గా నియమించాడు అనే అనుమానం గులాబీ తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు రాష్ట్ర కమిటీలో కూడా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత అంటూ లీకులు ఇస్తున్నారని అంటున్నారు. కారు మెకానిక్ చెప్పినట్లు టైర్లు అరిగాయి సెల్ఫ్ లేదు కాబట్టి బ్యాటరీ మార్చాలి. ఇంకా కొన్నివిడి భాగాలు కూడా మార్చాలి అంటే వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను మార్చాలనేదే దాని అర్థం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే మెకానిక్ ఎక్కడెక్కడ ఏమేమి మార్చాలో,ఎవరెవరిని మార్చాలో మొదటి నివేదిక ఇచ్చాడు అని కూడా గులాబీ తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.
అరిగిన టైర్లను,పాడైన బ్యాటరీ ని ఇతర విడిభాగాలను పక్కన పడేయకుండా దేనికైనా ఉపయోగించాలి అనే ఆలోచనతో కారు ఓనర్ వాటిని మళ్లీ ఏదో ఒక దానికి ఉపయోగించే పనిలో ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బహుశా అందులో భాగమే జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శులు గా నియామకం అని అంటున్నారు.పార్టీ నిర్మాణం పై ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టని కేసీఆర్ ఈ సారి ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ లను అధ్యక్షులు గా నియమించడం, అంతే కాకుండా రాష్ట్ర కమిటీలో కూడా వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు అని లీకులు ఇవ్వడం.. అంటే కారు రిపేర్ సందర్భంగా పక్కన పెట్టిన విడిభాగాలను ఏదో ఒక రకంగా వాడుకోవాలని కారు ఓనర్ ఆలోచన అయి వుంటుంది అని అంటున్నారు. 2001 నుంచి టిఆర్ఎస్ ని చూసిన వారికి ఆ పార్టీ నిర్మాణం ఎలా వుంటుందో తెలుసు. ఏ నాడు కేసీఆర్ పార్టీ నిర్మాణం పై సీరియస్ గా దృష్టి పెట్టలేదు అని తెలుసు. అదేమిటంటే మాది బిఎస్పి తరహా నిర్మాణం అని కెసిఆర్ ఎప్పుడూ చెబుతూ వుంటాడు అని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.కొన్ని సార్లు కేవలం జిల్లా కన్వీనర్ లను మాత్రమే నియమించారు తప్ప పూర్తి స్థాయి జిల్లా కమిటీ ని నియమించలేదు.అలాగే విద్యార్థి..యువజన.. మహిళా సంఘం అధ్యక్షులను మాత్రమే నియమించారు తప్ప పూర్తి స్థాయి కమిటిని నియమించలేదు.ఇప్పుడు కూడా కేవలం జిల్లా అధ్యక్షులను మాత్రమే నియమించి పూర్తి స్థాయి కమిటిని నియమించే పరిస్థితి కనపడడం లేదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కారు కు రిపేర్ చేస్తున్న పీకే గ్యారేజ్ ఏఏ విడిభాగాలను మారుస్తుందో తెలియటం లేదు. అలాగే పాత సరుకును కారు ఓనర్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాడోదాని వలన ఎవరి తల రాత మారుతుందో అర్థం కాక సిట్టింగ్ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు అని సమాచారం. జిల్లా అధ్యక్షులుగా నియమించడం ప్రమోషనా..డీప్రమోషనా.. అని అర్థం కాక సతమతం అవుతున్నారు. మొత్తానికి కారు రిపేర్ కు రావటం… పీకే గ్యారేజ్ ఎంటర్ కావటంతో గులాబీ బాబుల్లో గుబులు మొదలైందని అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.