– టీఆర్ఎస్ వ్యూహకర్తగా పీకే
– కీలకంగా వ్యవహరించిన ఏపీ సీఎం
– జాతీయ రాజకీయాల్లో ఉడకని పీకే పప్పులు
– పీకే స్ట్రాటజీలతో అసంతృప్తిలో మమత
– కేసీఆర్ ని అయినా గట్టెక్కిస్తాడా?
సునీల్ పోయి పీకే వచ్చే టాం..టాం. టాం. టీఆర్ఎస్ రాజకీయ వ్యుహకర్తగా ముందు సునీల్ అనే వ్యక్తిని కేసీఆర్ నియమించుకొన్నాడు. అదే సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీకేతో సంప్రదింపులు జరిపి తుది ఒప్పందానికి సిద్దం అవుతున్నాడని కేసీఆర్ కు సమాచారం అందింది. అంతే..తక్షణం పీకేను తమ పార్టీ వ్యూహకర్తగా నియమించుకోవాలి అని భావించాడు. అందుకు వైఎస్ జగన్ ద్వారా పీకేపై ఒత్తిడి తెచ్చి రేవంత్ రెడ్డితో జరిపిన సంప్రదింపులను పక్కన పెట్టేలా చేశాడు. అప్పుడు కేసీఆర్..పీకేతో మాట కలిపి టీఆర్ఎస్ వ్యూహకర్తగా ఉండేందుకు 200 కోట్ల రూపాయల ప్యాకేజ్ తో కూడిన ఒప్పందాన్నికుదుర్చుకున్నాడు.వైఎస్ జగన్ ద్వారా పీకేపై కేసీఆర్ ఎందుకు ఒత్తిడి తెచ్చాడు అని అందరికి అనుమానం కలగవచ్చు. అందుకు బలమైన కారణం లేకపోలేదు.పీకే దేశవ్యాప్తంగా జరిపే కార్యక్రమాలకు ప్రధాన అడ్డ హైదరాబాద్.లోటస్ ఫాంట్ లోని జగన్ ఇంట్లోనే ఆయన ఆఫీస్ ఉంది.జగన్ ఉచితంగానే తన ఇంటిని పీకేకు ఇచ్చాడనే ప్రచారం కూడా గతంలో జరిగింది.రేవంత్ రెడ్డితో జరిపిన చర్చలు ఫైనల్ దశలో ఉండగా వారిని కాదని కేసీఆర్ తో ఒప్పందం చేసుకోవాలంటే పీకేపై బలమైన ఒత్తిడి కావాలి కనుక జగన్ ఎంటర్ అవ్వకతప్పలేదు. షర్మిల పార్టీ పెట్టడం వెనుక కూడా పీకే ఉన్నాడన్న సంగతి అందరికి తెలిసిందే.
బెంగాల్ ఎన్నికల తరువాత తాను భవిష్యత్ లో రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని పీకే బహిరంగంగానే ప్రకటించాడు. బీజేపీని గద్దె దించేందుకు జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా పని చేస్తానని కూడా తెలిపాడు. దానికి తగ్గట్టుగానే రాహుల్, ప్రియాంక, శరత్ పవార్ లతో భేటి అయ్యి జాతీయ రాజకీయాల్లో కొద్ది రోజులు హడావుడి చేసాడు. కాంగ్రెస్ లో కీలక పదవి సంపాదించడం కోసం చేయని ప్రయత్నం లేదు. కాంగ్రెస్ నాయకత్వం బలహీనతను అడ్డం పెట్టుకొని ఆ పార్టీలో కీలక పదవి పొందొచ్చని భావించాడు. కానీ రాహుల్ అందుకు అంగీకరించలేదని సమాచారం.
కేవలం వ్యూహకర్తగా మాత్రమే పని చేయాలని రాహుల్ ఆఫర్ ఇచ్చాడు. తన ఆశలు అడియాశలు కావడంతో పీకే నిరుత్సాహానికి గురయ్యాడు. దీంతో మమతను ప్రధానిని చేస్తానని ఆమెని దగ్గరకి చేరాడు. బీజేపీకి.. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని.. రాహుల్ శక్తి సరిపోదని మమత దగ్గర చెప్పుకొచ్చాడు. తమరు అయితేనే మోడీతో ఢీ అనగలరని ఆమెను ఒప్పించాడు. మమతను అడ్డం పెట్టుకొని జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పొచ్చని కాంగ్రెస్ ను తన దారికి తెచ్చుకోవచ్చని పీకే భావించాడు. గోవాలో తృణమూల్ తరఫున హడావుడి చేసాడు. ఇంకేముంది రెండు మూడు చిన్న రాష్ట్రాలలో తృణమూల్ అధికారంలోకి రాబోతుంది అనే కలర్ ఇచ్చాడు. తీరా గోవాలో పీకే వ్యూహం వర్క్ ఔట్ కాలేదు. దీంతో మమత అసంతృప్తి వ్యక్తం చేసింది. భవిష్యత్ లో వ్యూహకర్తగా పని చేయనని భీష్మించుకుని కూర్చున్నపీకే చేసేది లేక మళ్ళీ రాజకీయ వ్యూహకర్తగా రంగంలోకి దిగాడు.
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని తాను రచించిన వ్యూహాన్నివర్క్ ఔట్ చేసుకోలేకపోయిన పీకే.. రెండు టర్మ్స్ అధికారంలో ఉండి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేసిఆర్ ను ఎలా గట్టెంకించగలడని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.