చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒకటి దక్షిణ చైనా ప్రాంతంలో సోమవారం కూలిపోయింది.
కున్మింగ్ సిటీ నుంచి గ్వాంగ్ జౌకు 132 మందితో వెళుతున్న బోయింగ్ 737 విమానం కుప్పకూలిం వుజౌ ప్రావిన్స్ లో కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఈ ఘటనలో ఎంత మంది మరణించారన్న దానిపై ఇప్పటి వరకు సమాచారం లేదని అధికారులు ప్రకటించారు.
విమానంలో 123 మంది ప్రయాణీకులు, 9 మంది సిబ్బంది ఉన్నట్టు వెల్లడించారు. తాను చూస్తుండగానే కొండపై విమానం కూలిపోయిందని, వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని దీని వల్ల సమీపంలోని అటవీ ప్రాంతాలు ధ్వంసమైనట్లు తాను చూశానని గ్రామస్తుడు చెప్పారు.