71మందితో కూలిన విమానం

నేపాల్ లో 71మంది ప్రయాణీకులతో కూడిన విమానం కూలిపోయింది. ఖాట్మాండు శివారులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఈ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. విమానం మొత్తం అగ్నికి ఆహుతి అవ్వడంతో విమానంలోని 49మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బోయింగ్ 737 పేరుగల ఈ విమానం ఢాకానుంచి ఖాట్మాండు ప్రయాణిస్తుంది.