ఆగస్టు 7వ తేదీన కేరళలోని కోజికోడ్‌లో ఎయిరిండియాన విమానం కూలిపోయి 19 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మొత్తం 100 మందికి పైగా గాయపడ్డారు. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద ఆ విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా ఎయిర్‌పోర్టు రన్‌వేపై పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో రన్‌వేపై విమానం జారి ప్రమాదానికి గురైంది. కానీ నిజానికి పైలట్లు గనక ఆ సమయంలో చాకచక్యంగా గనక వ్యవహరించకపోయి ఉంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండేవారు. ఎందుకంటే…

ఆ విమానంలో నిజానికి ఇంధనం ఎక్కువగా ఉంది. అయితే రన్‌వేపై నీరు ఎక్కువగా ఉండడంతో విమానం జారుతుందని పైలట్లు ముందుగానే పసిగట్టారు. దీంతో విమానాన్ని అక్కడే పలు మార్లు గాల్లో చక్కర్లు కొట్టించారు. దీంతో ఇంధనం స్థాయి కొంత వరకు తగ్గింది. తరువాత పైలట్లు వింగ్ కమాండర్ దీపక్ వి.సాథె (రిటైర్డ్), కెప్టెన్ అఖిలేష్ కుమార్‌లు విమానాన్ని రన్‌పై ల్యాండ్ చేయించే యత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తూ విమానం రన్‌వేపై జారి ప్రమాదం జరిగింది.
అయితే ఆ పైలట్లు గనక విమానాన్ని అక్కడే గాల్లో చక్కర్లు కొట్టించకుండా అలాగే గనక దింపి ఉంటే.. విమానంలో ఉన్న ఇంధనం మొత్తం బయటకు వచ్చి పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఉండేది. ఆ విషయం వారికి ముందుగానే తెలుసు. కనుకనే ప్రమాద తీవ్రత తక్కువ ఉండేలా ముందుగానే విమానంలోని ఇంధనాన్ని ఖర్చు చేశారు. దీంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. లేదంటే ఇంకా పెద్ద ప్రమాదం సంభవించి విమానంలో ఉన్న అందరూ చనిపోయి ఉండేవారు. ఏది ఏమైనా ఆ పైలట్లు అలాంటి విపత్కర సమయంలో చూపిన సమయస్ఫూర్తి వల్లే ఎక్కువ మంది బతికారు. ఇదీ.. అసలు ఆ రోజు జరిగిన విషయం. ఆ పైలట్లు ముందు చూపుతో వ్యవహరించినందుకు నిజంగా వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!