యూఎస్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ కరోలినాలో లారీలోకి విమానం దూసుకుపోయిన ఘటనలో పైలెట్ మృతి చెందారు. లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
డావిడ్ సన్ కౌంటీ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో బీచ్ క్రాఫ్ట్ బారన్ విమానం ఐ-85 సౌత్ బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో లారీని డీ కొట్టినట్టు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్ పోర్టు రన్ వే నుంచి టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తు్న్నారు. విమానం ఢీ కొట్టిన వెంటనే లారీకి ఉన్న ట్రైలర్ బోల్తా పడింది. దీంతో లారీ డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.
లారీ డ్రైవర్ ను విన్ స్టన్ సేలం ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. విమానం టేకాఫ్ తీసుకోవడం సమస్యలను ఎదుర్కొన్నట్టు కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.