ఈ చేతి వాటం ఉంది చూసారు. దాని బుద్ధిపోనిచ్చుకోదు.! అధికారులంతా దేశంలో జరుగుతున్న జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు ఏర్పాట్లలో బిజీగా ఉంటే…ఓ వ్యక్తి మాత్రం అక్కడ సుందరీకరణ కోసం పెట్టిన పూలమొక్కల్ని దొంగిలించే పనిలో బిజీగా ఉన్నాడు.
గురుగ్రామ్‌లోని శంకర్ చౌక్ కి కియా కారులో నుంచి డ్రైవర్‌తో పాటు ఓనర్ కూడా కారు దిగాడు. అంతే.. అక్కడున్న అందమైన పూల మొక్కలను లేపేసి తన కారు డిక్కీలో డ్రైవర్‌తో సర్దించేసి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
దీనినంతటినీ ఓ వ్యక్తి ఫోన్‌లో వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు. అంతే.. ఇది కాస్తా తెగ వైరల్ అవుతోంది. కారుపై వీఐపీ నంబర్ ఉండటంతో అతనొక గవర్నమెంట్ ఆఫీసర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రూ.40 లక్షల కారులో తిరుగుతున్న ఆ వ్యక్తి దగ్గర మొక్కలు కొనేందుకు కనీసం రూ.40 కూడా లేవా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి వ్యూస్, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు బుధ, గురువారాల్లో న్యూఢిల్లీలో నేడు ప్రారంభమైంది. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు సహా ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
ఇక.. ఇదే సమయంలో రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్ ప్రత్యేకంగా ద్వైపాక్షిక భేటీలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
#G20 के सौंदर्यीकरण के "चिंदी चोर"
गुरुग्राम में शंकर चौक पर #Kia कार सवार ने दिनदहाड़े पौधों के गमले उड़ाए ।।@gurgaonpolice @DC_Gurugram @cmohry @MunCorpGurugram @OfficialGMDA @TrafficGGM pic.twitter.com/aeJ2Sbejon— Raj Verma-Journalist🇮🇳 (@RajKVerma4) February 27, 2023