అంతర్జాతీయ క్రికెట్ లో కొన్ని మైలురాళ్ళు అందుకోవాలని చాలా మంది ఆటగాళ్ళు తపిస్తూ ఉంటారు. ఆ లక్ష్యాలు త్రుటిలో మిస్ అయినప్పుడు ఉండే బాధ అంతా ఇంతా కాదు. అలా కొందరు ఆటగాళ్ళు లక్ష్యానికి దగ్గరగా వెళ్లి దూరమైన వాళ్ళు ఉన్నారు. క్రికెట్ లో డబుల్ సెంచరీ అనేది ఇప్పుడు చాలా మంది బ్యాట్స్మెన్ ల కల. అయితే అక్కడి వరకు వెళ్లి ఒక్క పరుగుతో దూరం చేసుకున్న ఆటగాళ్ళు కొందరు ఉన్నారు.
Also Read:సికింద్రాబాద్‌లో భారీ వర్షం..పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత
ముధసిర్ నాజర్
1984 లో ఈ పాకిస్తాన్ ఆటగాడు డబుల్ సెంచరీ ని మిస్ అయ్యాడు. కాని ఒక్క పరుగుతో ఆ లక్ష్యాన్ని మిస్ చేసుకున్నాడు.
అజహరుద్దీన్
అంతర్జాతీయ క్రికెట్ లో ఈ పేరు ఒకప్పుడు సంచలనం. అయితే ఒక్క పరుగుతో శ్రీలంకపై 1986 లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
మాథ్యు ఇలియట్
ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 199 పరుగులు చేసి టార్గెట్ మిస్ అయ్యాడు.
సనత్ జయసూర్య
శ్రీలంక క్రికెట్ ను ఒకప్పుడు శాసించిన ఈ దిగ్గజం కూడా ఇలాగే డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 97 లో ఇండియా తో ఆడే మ్యాచ్ లో 199 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
స్టీవ్ వా
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుని కొత్త పుంతలు తొక్కించిన ఈ ఆటగాడు… వెస్టిండీస్ జట్టు పై డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. 199 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
యూనిస్ ఖాన్
ఈ పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం కూడా డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 2006 లో టీం ఇండియా తో ఆడుతున్నప్పుడు హర్భజన్ బౌలింగ్ లో 199 పరుగులకు అవుట్ అయ్యాడు.
ఇయాన్ బెల్
ఈ ఇంగ్లాండ్ ఆటగాడు కూడా డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా తో 2008 లో జరిగిన మ్యాచ్ లో 199 పరుగుల వద్ద వికెట్ ఇచ్చేసాడు.
స్టీవ్ స్మిత్
మోడరన్ డే గ్రేట్స్ లో ఒకడిగా చెప్పుకునే స్మిత్ కూడా ఒకసారి డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 199 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
కెఎల్ రాహుల్
ఈ యువ ఆటగాడు కూడా ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో డబుల్ సెంచరీ వరకు వెళ్లి వికెట్ పారేసుకున్నాడు.
డీన్ ఎల్గర్
ఈ సౌత్ ఆఫ్రికా సీనియర్ ఆటగాడు కూడా ఇలాగే డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 199 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
మార్టిన్ క్రోనే
ఒక్క పరుగు తో ట్రిపుల్ సెంచరీ దూరం చేసుకున్న ఆటగాడు. శ్రీలంక తో మ్యాచ్ లో 299 పరుగుల వరకు వెళ్లి ట్రిపుల్ సెంచరీ ని మిస్ చేసుకున్నాడు.
Advertisements
Also Read:జీ7 దేశాల నేతలకు నిజామాబాద్ కళాకృతులు