ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం లేదని, హిందువులపై చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నానని అస్పాంకు చెందిన ఏఐయూడీఎఫ్ రాజకీయ పార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆయన హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజీయ దుమారానికి దారి తీశాయి. దీంతో వెనక్కి తగ్గిన అజ్మల్.. ఒక సీనియర్ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని.. నా వ్యాఖ్యలతో బాధపడుతున్న ప్రతీ ఒక్కరికీ.. నేను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
నేను చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నానని అన్నారు. మైనార్టీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని.. వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. జనాభా నియంత్రణ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అజ్మల్ అన్నారు.
అయితే శుక్రవారం రోజున అజ్మల్ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువులు చిన్న వయస్సులో పెళ్లి చేసుకునేందుకు ముస్లిం ఫార్ములాను పాటించాలని సూచించారు. ముస్లిం యువకులు 20-22 ఏళ్ల వయస్సులో.. అమ్మాయిలు 18 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటారని.. హిందువులు మాత్రం 40 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లి చేసుకుంటారని అన్నారు.
హిందువులు పెళ్లికి ముందు రెండు మూడు అక్రమ సంబంధాలు కలిగి ఉంటారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పిల్లలు కనకుండా ఖర్చులు ఆదా చేసే పనిలో హిందువులు ఉంటారని అన్నారు. ముస్లింలు చిన్న వయస్సులో పెళ్లి చేసుకొని ఎంత మంది పిల్లల్ని కంటున్నారో చూడండి అని..
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీశాయి. దీంతో అతను బహిరంగ క్షమాపణ చెప్పాల్పి వచ్చింది.