ప్రపంచ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. కచ్చితంగా సినిమా నటులకి ఎలాగైనా ఆస్కార్ అవార్డు గెలవాలని డ్రీమ్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో “ఆర్‌ఆర్ఆర్” పేరు గట్టిగా వినపడుతోంది. ఉత్తమ చిత్రం ఆస్కార్ రిమైండర్ జాబితాలో “ఆర్ఆర్ఆర్” స్థానం దక్కించుకోవడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్” కి ఆస్కార్ రావాలని భారత సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నటించిన “పఠాన్” సినిమా ట్రైలర్ రిలీజ్ కావటం తెలిసిందే. ఈ ట్రైలర్ పట్ల రామ్ చరణ్ సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేయడం మాత్రమే కాదు షారుఖ్ ఖాన్ సార్ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు అని ప్రశంసించారు.
దీంతో షారుక్ స్పందించి రామ్ చరణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దేశానికి “ఆర్‌ఆర్‌ఆర్” సినిమా యూనిట్ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చాక దానిని ఒక్కసారి తాకే అవకాశం ఇవ్వండి అంటూ షారుక్ రామ్ చరణ్ ని కోరడం జరిగింది. ఇందుకు రామ్ చరణ్.. తప్పకుండా షారుఖ్ ఖాన్ సార్ ఒకవేళ.. మేము ఆస్కార్ గెలిస్తే భారతీయ సినిమాకి ఆస్కార్ వచ్చినట్లే అంటూ.. బదులు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
“ఆర్ఆర్‌ఆర్”కి ఇప్పటికే మూడు అంతర్జాతీయ అవార్డులు రావడం జరిగింది. ఈ క్రమంలో ఎలాగైనా ఆస్కార్ రావాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. “ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు కాంతారా, కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో నిలిచాయి. మరి ఆస్కార్ అవార్డు ఏ చిత్రానికి వరిస్తుందో చూడాలి. “ఆర్ఆర్‌ఆర్” కీ ఆస్కార్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులే చెబుతూ ఉండటం విశేషం.