కేరళ పాలక్కాడ్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయాలపాలైన వారికి రూ. 50,000 ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ప్రధాని ఆదేశించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు కేరళ పాలక్కాడ్ జిల్లాలోని వడక్కెంచేరిలో ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సును ఢీకొంది.
ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఊటీ టూర్‌కు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో పాఠశాల బస్సులోని ఆరుగురు విద్యార్థులు మరణించారు. మరోవైపు ఆర్టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణీకులు కూడా మృతి చెందారు.