సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్రం నూతనంగా తీసుకు వస్తున్న అగ్నిపథ్ స్కీమ్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ కేవలం ఆయన స్నేహితుల మాటలు మాత్రమే వింటారని, మరెవరి మాటా వినరని ఆయన ట్వీట్ చేశారు.
ఈ దేశ ప్రజలకు ఏం కావాలో ప్రధాని మోడీ ఎప్పటికీ అర్థం చేసుకోలేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కేవలం ఆయన స్నేహితుల మాటలు తప్ప మరెవరి మాటలూ వినరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
అగ్నిపథ్ పథకాన్ని దేశ యువత తిరస్కరించారని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. సాగు చట్టాలను దేశరైతాంగం వ్యతిరేకించిందన్నారు. నోట్ల రద్దును ఆర్థిక వేత్తలు, జీఎస్టీ బిల్లును వ్యాపార వేత్తలు తిరస్కరించారని ఆయన తెలిపారు.
మరోవైపు అగ్నిపథ్ పథకంపై పలు రాష్ట్రాలో నిరసనలు ఉద్రిక్తం అవుతున్నాయి. బిహార్ లో ఉప ముఖ్యమంత్రి రేణూదేవీ నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. సాహెబ్ పూర్ కమాల్ రైల్వే స్టేషన్ తో పాటు పలు ప్రాంతాల్లో రైళ్లపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు.