ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు పెనుముప్పని అభిప్రాయపడ్డారు ప్రధాని మోడీ. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. ఆఫ్ఘాన్ లో ప్రస్తుత పరిస్థితులను పరోక్షంగా వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ.
ఉగ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నారు మోడీ. స్థానికతపై ఆందోళన వ్యక్తం చేస్తూ… ప్రస్తుతం తీవ్రవాదం అతిపెద్ద సవాల్ గా మారిందని చెప్పారు. ఎస్‌సీవో గ్రూపులోని సభ్యులంతా శాంతి భద్రతలు, పరస్పర నమ్మకం వంటి అంశాలపై పనిచేయాలని సూచించారు. భవిష్యత్ గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చారు ప్రధాని.
షాంఘై సహకార సంస్థ 2001లో ఏర్పాటు చేశారు. ఇండియా, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్థాన్, ఇరాన్, చైనా, రష్యా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇరుగు పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పర విశ్వాసం పెంచుకోవాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు.