ప్రధాని మోడీ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ శక్తివంతమైన నేత అని, ఆయన ఓ గొప్ప క్రియాశీలక నేత అని థరూర్ అభివర్ణించారు.
” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతమైన నాయకుడు, ఆయన గొప్ప క్రియాశీలక నేత. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అంత మెజార్టీతో గెలుస్తుందని మేము అనుకోలేదు. కానీ మోడీ చేసి చూపించారు” అని అన్నారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే బీజేపీపై విమర్శలు చేశారు. ఈ రోజు బీజేపీ వాళ్లు కోరుకున్నది వాళ్లకు ఓటర్లు ఇచ్చారని అన్నారు. కానీ ఒక రోజు భారతీయ ఓటర్లు బీజేపీని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తారు అని ఆయన తెలిపారు.
సమాజంలోకి ప్రధాని మోడీ కొన్ని శక్తులను వదిలారని, అవి మతం వర్గం పరంగా జాతిని విడదీస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. వారు ప్రజల్లో విషం నింపుతున్నారంటూ మండిపడ్డారు.