ప్రధాని మోడీ నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్నారు. జమ్ము కశ్మీర్ స్వతంత్ర్య ప్రతిపత్తి రద్దు తర్వాత జమ్ములో ఆయన పర్యటించడం ఇది తొలిసారి కావడం విశేషం. అక్కడ ఆయన ఓ బహిరంగ సభలో పాల్గొననున్నారు. చివరగా 2019 అగస్టులో ఆయన జమ్ములో పర్యటించారు.
కేంద్ర పాలిత ప్రాంతంలోని రెండు ప్రాంతాల మధ్య రూ. 20000 కోట్లతో నిర్మించిన బనిహాల్-ఖాజిగుండ్ సొరంగ మార్గాన్ని ఆయన నేడు ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు గ్రామసభలో ఆయన ప్రసంగించనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
దేశంలోని ప్రతి జిల్లాలో 75 నీటి సంస్థలను అభివృద్ధి, పునరుజ్జీవింపజేసేందుకు ప్రధాని మోడీ ‘అమృత్ సరోవర్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పీఎంవో తెలిపింది.