ప్రధాని మోడీ రెండోరోజు వారణాసిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వర్ వేద్ మహామందిర్ లో జరిగిన సద్గురు సదాఫల్దియో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సద్గురు సదాఫల్దియాపై ప్రశంసలు కురిపించారు. అలాగే కాశీ ముఖచిత్రాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చివేసిందన్నారు. కాశీ ప్రతిష్ట, శక్తి నలుదిశలా విస్తరిస్తోందని తెలిపారు.
వారణాసి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్న ప్రధాని.. నగరాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఢిల్లీలో ఉన్నా తన మనసు వారణాసిపైనే ఉంటుందని.. ఇక్కడి అభివృద్ధిని చూసేందుకు తహతహలాడతానని అన్నారు మోడీ.
వారణాసిలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని కాశీ విశ్వనాథ్ ఆలయ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో సుపరిపాలనపై చర్చలు జరిపారు.