కరోనా కట్టడి, లాక్ డౌన్ సడలింపులు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న సందర్భంలో ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 8గంటలకు మోడీ ప్రసంగించబోతున్నారు.
దేశంలోని రాష్ట్రాల పరిస్థితులపై ఇప్పటికే ప్రధాని సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక లాక్ డౌన్ కారణంగా అనేక రంగాలు తీవ్రం నష్టపోయాయి. దీంతో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు కేంద్ర సహయం, ప్రజలకు ఆర్థిక సహాయం, లాక్ డౌన్ తీరుపై ప్రధాని ప్రకటన చేస్తారని దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.