సరిహద్దు గ్రామాల అభివృద్ధికి బడ్జెట్ లో ప్రవేశపెట్టిన వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర బడ్జెట్ -2022పై వెబినార్ లో మాట్లాడుతూ..
వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం అనేది సరిహద్దు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను బడ్జెట్ లో ప్రభుత్వం అందించిందన్నారు.
బడ్జెట్‌లో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సడక్ యోజన, జల్ జీవన్ మిషన్, ఈశాన్య కనెక్టివిటీ, గ్రామాల బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వంటి ప్రతి పథకానికి అవసరమైన కేటాయింపులు చేశామని వెల్లడించారు.
‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ అనే విధానం ప్రభుత్వ విధానాలను, చర్యలను వెనకుండి నడిపిస్తున్నదని అన్నారు.