ఉత్తమ్ కుమార్ రెడ్డి..టి పిసిసి అధ్యక్షులు
కరోనా లాక్ డౌన్ పీరియడ్ లో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ వలుస కార్మికులను ఆదుకునే విషయంలో దారుణంగా వైఫల్యం చెందారు. వీరి విషయంలో కనీస మానవీయంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడలే. వలస కార్మికులు చచ్చిపోయిన పర్వాలేదనుకున్నారా..? మోడీ కేసీఆర్ లో నిర్లక్ష దోరణి కనిపించింది. దేశ విభజన సమయంలో జరిగిన వలసల్లా ఉన్నాయని సోనియాగాంధీ తెలిపారు. వలస కార్మికులు 13 కోట్లు ఉన్నారు. పెద్ద ఎత్తున నిల్వఉన్న ఆహార ధాన్యాన్ని పంచలేదు నగదు బదిలి..ఆహార ధాన్యం పంపిణీ చేసుంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. కోట్ల మంది వలస కార్మికుల విషయంలో ఇంత వరకు ఏలాంటి ప్లాన్ లేదు. సీఎం కేసీఆర్ అన్నింటికి ఆయనే ఎక్స్ పర్ట్ లా మాట్లాడుతాడు.
సీఎం వలస కార్మికులు మూడున్నర లక్షలన్నారు. సీఎం ఆరు లక్షలన్నారు..మంత్రి తలసాని 7లక్షలన్నాకు మీదగ్గర లెక్కలు సరిగ్గా లేవు…మరి సహాయం ఏలా చేసారు. బిల్డింగ్ వర్కర్స్..ఇటుక బట్టిల్లో రైస్ మిల్లుల్లో పెత్తఎత్తున వలస కార్మికులు పనిచేస్తున్నారు. వలస కార్మికుల విషయంలో కేంద్ర రాష్ట్రాలని ఆమానవీయంగా ఉన్నాయి. వలస కార్మికులను తరలించడానికి ఆర్మీని రంగంలోనికి దించింతే బాగుండేది. ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంతో మేమే సోనియా గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ తరుపున పంపుతున్నాము. వలస కార్మికులను తరలించడంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాగా పనిచేసారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వచ్చాక పత్రికా స్వేచ్ఛ ఏలా ఉందో మీకు తెలుసు. దారుణంగా రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను తొక్కెస్తున్నారు. సీఎం కేసీఆర్ మీడియాను బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు డైరెక్టుగా జర్నలిస్టులను వేదిస్తున్నారు. నారాయణ్ ఖేడ్ తో కరోనా ఎమ్మెల్యే జన్మదినోత్సనాల చేసుకుంటే వార్త ఇచ్చిన రిపోర్టర్
ఇళ్లు కూల్చారు. జర్నలిస్టులపై దాడికి ఖండిస్తున్నాము.