అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో భాగంగా వారి ఖాతాలో రూ. 2 వేలు జమ చేయనుంది. ఇందుకు సంబంధించిన నిధులను ఈ నెల 25న ప్రధాని మోదీ
వీడియో కాన్ఫరెన్స్‌లో విడుదల చేయనున్నారు. అర్హులైన మొత్తం 9 కోట్ల మందికి పైగా ఉన్న రైతులకుగానూ.. రూ.18,000 కోట్లకుపైగా నిధులను ప్రధాని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి ఏడాది ఒక్కో రైతుకు కేంద్రం రూ. 6 వేలు సాయంగా అందిస్తోంది. అయితే ఈ నిధులని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున అందిస్తోంది. 25వ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా పాల్గొంటారు. రైతులకు కేంద్రం అందిస్తున్న పథకాలతో కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకుంటారు. అలాగే వారి సాధాకబాధలను ప్రధాని, వ్యవసాయశాఖ మంత్రి తెలుసుకుంటారు.