దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముంచుకొస్తుంది. ఇప్పటికే ఢిల్లీ సహా పలు మెట్రో నగరాల్లో కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో వేవ్ మొదలవుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది.
దేశంలో అన్ లాక్ ప్రక్రియన నడుస్తుంది. కానీ సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించే పరిస్థితులు ఏమాత్రం కనిపించటం లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో… ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కాబోతున్నారు.
ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, సెకండ్ వేవ్ కు సన్నద్ధతో పాటు వ్యాక్సిన్ పంపిణీ గురించి చర్చించే అవకాశం ఉంది. రెండు దఫాలుగా నిర్వహించనున్న ఈ మీటింగ్ లో అత్యవసర వ్యాక్సిన్ కు అనుమతిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఇప్పటికే నీతి ఆయోగ్ వ్యాక్సిన్ ధరపై సమాలోచనలు చేస్తుండగా… థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లో ఉన్న వ్యాక్సిన్ డేటా ఆధారంగా వెంటనే వ్యాక్సినేషన్ కు అనుమతిస్తే ఎలా ఉంటుందన్న ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వీటిపై సీఎంల అభిప్రాయాన్ని తీసుకొని… ఫైనల్ గా కేంద్రం తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.