ప్రధాని మోడీ నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఆయన పర్యటిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఓ సమావేశంలో ఆయన ప్రసంగించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
నూతనంగా నిర్మించిన మాతుశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
సాయంత్రం 4 గంటలకు గాంధీనగర్ లో సహకార్ సే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొని సహకార సంఘాల సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతారు.
అనంతరం నానో యూరియా కంపెనీని ఆయన ప్రారంభిస్తారు. దీన్ని రూ. 175 కోట్లతో నిర్మించారు. ఈ సెమినార్ లో సుమారు 7000 మందికి పైగా సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.