‘హర్ ఘర్ తిరంగా’ మూవ్ మెంట్ ను బలోపేతం చేయాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఇందుకోసం ఆగస్టు 13-14 మధ్య ప్రజలు తమ ఇండ్లలో జాతీయ జెండాను ఎగుర వేయడం లేదా జెండా ప్రదర్శించడం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. భారత చరిత్రలో జూలై 22 ప్రత్యేకమైన రోజు అని ఆయన అన్నారు. ఆ రోజున భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఆమోదించారని ఆయన పేర్కొన్నారు.
ఈ సంవత్సరం, మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నప్పుడు, హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
ఆగస్టు 13,15 తేదీల మధ్య మీ ఇండ్లలో జాతీయ పతాకాన్ని ప్రదర్శించండని ప్రజలను ఆయన కోరారు. ఈ ఉద్యమం జాతీయ జెండాతో మనకున్న అనుబంధాన్ని మరింతగా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.