యువత పట్ల ప్రధాని మోడీ చాలా కేర్ తీసుకుంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అగ్నిపథ్ స్కీం, వయోపరిమితి పెంపు వల్ల చాలా మంది పురుష, మహిళా అభ్యర్థులకు లబ్ది చేకూరుతుందన్నారు.
గత రెండేండ్లలో కొవిడ్-19 నేపథ్యంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ పై ప్రభావం పడిందన్నారు. అగ్నివీర్స్’ రిక్రూట్‌మెంట్ వయోపరిమితిని (ఈసారి) 21 నుండి 23 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.
‘ తాజా నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. దీంతో వారు దేశానికి సేవ చేసే దిశలో మరింత ముందుకు సాగుతారు. ఇందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు’ అని అన్నారు.
అంతకు ముందు సైనిక దళాల్లో అగ్ని వీరులుగా చేరాలని యువతను భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కోరారు. అగ్ని పథ్ పథకం కింద సైన్యంలో చేరేందుకు యువతకు వయోపరిమితిని 21 నుంచి 23 ఏండ్లకు పెంచినట్టు ఆయన తెలిపారు.