పౌరసత్వ సవరణ చట్టం, జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై పునరాలోచించే అవకాశమే లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని తన సొంత లోక్ సభ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ…జాతి ప్రయోజనాల కోసం తాము తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ నిర్ణయాల కోసం దేశం కొన్నేళ్లుగా ఎదురుచూసిందని చెప్పారు.